అయ్యో.. 842 మంది భారతీయ విద్యార్థులు మృతి
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలి.. ఉద్యోగం సాధించాలి అని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. అయితే ఎన్నో ఆశలతో అమెరికా లాంటి దేశాలకు వెళ్లి అక్కడి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు 800లకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 2018 నుంచి 2024 మధ్య 842 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అందించింది.
ఈ లిస్టులో అమెరికా ఫస్ట్ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికంగా 141 మంది భారత విద్యార్థులు మృతి చెందారు. వీరి మరణాలకు కారణంలో అధికశాతం మెడికల్ కారణాలు, సూసైడ్లు, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. ఈ నివేదిక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, కుటుంబాలు.. విద్యార్థుల భద్రత, సహాయం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేస్తోంది.
ఇటీవల అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అయితే అక్టోబర్ 4న డల్లాస్ లో ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మరోసారి విదేశాల్లోని భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

విదేశాంగ మంత్రిత్వశాఖ అందించిన సమాచారం ప్రకారం.. 2018 నుంచి 2024 మధ్య 842 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ మరణాల్లో 96 శాతం మెడికల్ సమస్యలు, సూసైడ్స్, యాక్సిడెంట్స్, ఇతర కారణాలుగా ఉంది. ఈ లిస్టులో 141 మరణాలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత దుబాయ్ 133 మందితో రెండోస్థానంలో.. కెనడాలో 119 మంది.. ఖతార్ లో 57 మంది.. ఆస్ట్రేలియాలో 56 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications