Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యో.. నదిలో మునిగిన టూరిస్టుల పడవ.. 34 మంది మృతి

ఆహ్లాదకరంగా నదీ అందాలను చూడాలని బయల్దేరిన వారికి విషాదమే మిగిలింది. ప్రతికూల వాతావరణం కారణంగా టూరిస్టులు ప్రయాణిస్తున్న పడవ నదిలో మునిగింది. ఈ ప్రమాదంలో 34 మంది మృతి చెందారు. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులే కావడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 8 మంది గల్లంతయ్యారు. మరో 11 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. నదిలో టూరిస్టులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు. మరో 8మంది గల్లంతయ్యారు. 11 మందిని రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే మృతుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. వీళ్లంతా ప్రముఖ పర్యటక ప్రాంతమైన హా లాంగ్‌ బేకు వెళ్లాలని బయల్దేరారు. పడవ ప్రారంభం అయిన సమయంలో 48 మంది టూరిస్టులు ఉన్నారు. ఐదుగురు ఆపరేటర్లు ఉన్నారు.

Tragic Vietnam Boat Accident 34 Dead as Tourist Vessel Capsizes in Ha Long Bay

అదే సమయంలో బలమైన గాలులతోపాటు భారీ వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించక పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు. మరో 8మంది గల్లంతయ్యారు. 11 మందిని రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే మృతుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నారు.

సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. నాలుగు గంటలు శ్రమించి పలువురిని కాపాడాయి. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+