వివాదాస్పదవ్యాఖ్యలుపోస్టు చేసిందని మిస్ ఇంటర్నేషనల్ బ్యూటీ అరెస్టు
సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసిందని ట్రాన్స్ జెండర్ బ్యూటీని విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు పోలీసులు.
మయన్మార్ :పాపులర్ నటిగాదూసుకుపోతోన్న మయన్మార్ (ట్రాన్స్ జెండర్ ) బ్యూటీ మ్యోకోకోసాన్ అరెస్టైంది.థాయిలాండ్ ట్రిప్ నుండి తిరిగొస్తోన్న ఆమెను విమానాశ్రయంలోనే అరెస్టుచేశారు పోలీసులు.
సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతినేలా పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తోందని ఆమెపై పిర్యాదులు వచ్చాయి.
ఆమెను యాంగన్ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. ప్రస్తుతం మహిళల జైలులో ఒంటరిగా ఉంచి విచారణ చేస్తున్నారు.

ఈ నెలాఖరుకు అది పూర్తయ్యే అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారంగా ఆమెను అరెస్టుచేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
వుట్ మెన్ యి అనే వ్యక్తిని అవమానించేలా ఆమె ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో అసభ్యకరంగా సందేశాలను పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటోంది.
లింగమార్పిడి చేసుకొన్న తర్వాత థాయ్ లాండ్ లో జరిగిన ట్రాన్స్ జెండర్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ బ్యూటీ కాంటెస్ట్ లో ఆమె తొలి స్థానాన్ని దక్కించుకొన్నారు. ఈమె 2015 లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆనాటి నుండి ఆమె సినిమా రంగంలో కూడ అడుగుపెట్టారు.












Click it and Unblock the Notifications