పురుషుల అందాల పోటీలకు తాను సైతం.. ట్రాన్స్‌జెండర్ వండర్
హైదరాబాద్ : పురుషుల అందాల పోటీకి తాను సైతం అంటున్నాడు ఓ ట్రాన్స్‌జెండర్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీల్లో పాల్గొనడానికి ముందుకొచ్చాడు. దాంతో పురుషుల అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర పుటల్లో ఓ పేజీ దక్కించుకోనున్నాడు. బ్రెజిల్ కు చెందిన 23 ఏళ్ల బెర్నార్డో రిబేరో పుట్టుకతో స్త్రీ. అయితే లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారాడు. బ్రెజిల్‌లో జరుగనున్న మిస్టర్ బ్రెజిల్ అందాల పోటీలకు ఎంపికయ్యాడు.
మొత్తానికి ఈ పోటీలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక మిస్టర్ బ్రెజిల్ టైటిల్ సాధించడమే నా కల అంటున్నాడు బెర్నార్డో రిబేరో. మోడల్ గా పనిచేస్తున్న బెర్నార్డో.. పుట్టుకతో అమ్మాయినైనా ఏనాడు కూడా అలా అనిపించలేదని చెబుతుంటాడు. తనలో పురుష లక్షణాలు అధికంగా ఉండటంతోనే లింగమార్పిడి చేయించుకున్నానని గర్వంగా ఫీలవుతాడు.

రియోడాస్ పెడ్రాస్ అనే టౌన్ నుంచి అందాల రేసులో ఉన్న బెర్నార్డో.. తమదైన లైఫ్‌ను ఎంజాయ్ చేయలేని చాలామందికి స్ఫూర్తిగా ఉండాలనకుంటున్నట్లు చెబుతున్నాడు. అదలావుంటే స్వలింగ సంపర్కం బ్రెజిల్‌లో నేరంగా పరిగణిస్తారు. ఆ మేరకు చట్టం కూడా తయారుచేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన వారం వ్యవధిలోనే పురుషుల అందాల పోటీలో బెర్నార్డో పోటీ చేస్తున్న విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. మొత్తానికి బెర్నార్డోతో పాటు మరో 19 మంది పోటీపడుతుండటం గమనార్హం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications