అతడుగా రేప్ చేసి.. ఆమెగా శిక్ష అనుభవిస్తోంది!
లండన్: ఇదో వింత ఘటనగా చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి పురుషుడిగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు మహిళగా లింగమార్పిడి చేసుకున్నాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆమెగా మారిన అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అతడ్ని దోషిగా తేల్చిన కోర్టు.. కస్టడీ విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. డేవిడ్ అనే వ్యక్తి 2004 వేసవిలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిపాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మూడేళ్ల కిందట అతను టాన్స్‌జెండర్‌గా మారాడు. తన పేరు డెవినా ఆర్టన్‌గా మార్చుకున్నాడు. కాగా, ఆర్టాన్‌ను గత జనవరిలో పోర్ట్‌మౌత్ క్రౌన్ కోర్టు దోషిగా తేల్చింది.
ఆమెకు శిక్ష విధించిన అనంతరం పురుషుల జైలుకు తరలించనున్నారు. కోర్టు విచారణ వివరాల ప్రకారం.. ఆర్టాన్ 2004లో వేసవిలో బాధితురాలిని కలిశాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఆమె, ఆమె మరో ఇద్దరు స్నేహితులు పోర్ట్స్ మౌత్‌లోని ఓ గ్యారేజ్‌లో ఆర్టాన్ తో కలిసి మద్యాన్ని సేవించారు.
అక్కడే సోఫాపై రాత్రి పడుకున్నారు. ఈ సమయంలో ఆర్టాన్.. 15ఏళ్ల బాధిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని ఆపడానికి ఆమె ఎంతగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. కొంచెం దూరంలోనే ఆమె స్నేహితులు నిద్రపోతున్నా.. మద్యం మత్తులో ఉండటంతో మేల్కొనలేదు.

కాగా, ఆర్టాన్ జీవితం అస్తవ్యస్తంగా సాగిందని, అతను ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయంలో పెరిగాడని, తన సాయం కోసం వచ్చిన టీనేజ్ అమ్మాయిని రేప్ చేసినట్టు అతను అంగీకరించాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఆర్టాన్ నిరుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో న్యాయమూర్తి ఆమెకు కస్టడీకి విధించారు.
ఆమెకు జైలు శిక్ష వేసిన అనంతరం హంప్‌షైర్‌లోని వించెస్టర్ పురుషుల జైలుకు పంపనున్నారు. లింగమార్పిడి చేయించుకున్నప్పటికీ భౌతికంగా శరీరంలో మార్పుల కోసం ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదని ఆర్టాన్ న్యాయమూర్తికి తెలిపింది. పురుషుడిగా ఉన్నప్పుడు ఓ బిడ్డకు తండ్రి అయిన ఆర్టాన్.. పిల్లలు అసభ్య ఫొటోలు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై కూడా కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications