అపానవాయువుతో కరోనా సోకుతుందా..? చైనా పరిశోధకులు ఏం తేల్చారు..?
చైనా: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఎటు చూసినా ఈ మహమ్మారిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ రక్కసి బారిన పడి మూడువేలకు పైగా మృతి చెందగా కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో కొత్త వార్త ప్రజల్లో మరింత ఆందోళన సృష్టిస్తోంది. ఇప్పటి వరకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందనేది విన్నాం. తాజాగా అపానవాయువు ద్వారా కూడా కరోనావైరస్ సోకుతుందనేది వెలుగులోకి వచ్చింది. దీనిపై చైనాలోని బీజింగ్ డిజీస్ కంట్రోల్ సెంటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనావైరస్ పలు మార్గాల గుండా మనిషిని సోకుతోంది. తాజాగా చైనాలోని బీజింగ్ డిజీస్ కంట్రోల్ సెంటర్ మరో కొత్త విషయం బయటపెట్టింది. కరోనావైరస్ అపానవాయువుతో కూడా మరో మనిషికి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే వ్యక్తి ధరించిన ప్యాంట్లు అడ్డుగా ఉండటం వల్ల చాలావరకు ఇది బయటకు రాదని వైరస్ అక్కడే చచ్చిపోతుందని వారు స్పష్టం చేశారు.
ప్యాంట్లు ధరించకుండా ఉండే పేషెంట్లు అపానవాయువును విడుదల చేసినప్పుడు మరో వ్యక్తి దగ్గరగా ఉండి ఆ వాయువును పీల్చితే కరోనా సోకే అవకాశాలున్నాయని వెల్లడించింది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుందని కూడా స్పష్టం చేసింది బీజింగ్ డిజీస్ కంట్రోల్ సెంటర్.

ఇక అపానవాయువు ద్వారా కరోనావైరస్ సోకుతుందా అనేదానిపై పరిశోధనలు చేశాకే ఈ నిర్థారణకు వచ్చినట్లు డిజీస్ కంట్రోల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. కరోనావైరస్ సోకిన వ్యక్తి నుంచి యూరిన్ మరియు మలం శాంపిల్స్ తీసుకుని పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరిశోధనల్లో కరోనా వైరస్ యొక్క తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉందని గుర్తించినట్లు చెప్పారు. అపానవాయువు విడుదల చేసిన సమయంలో ఇది మరో మనిషికి సోకే అవకాశం ఉందని చెప్పారు.
ఇక ఇదే విషయంపై ఒక ఆర్టికల్ కూడా ప్రచురించింది. వింటానికి కొంత విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిజమని పరిశోధనలు చేశాకే ఒక నిర్థారణకు వచ్చినట్లు వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే ధరించే ప్యాంట్ల వల్ల ఎలాంటి అపాయం ఉండబోదని కూడా స్పష్టం చేశారు.

Recommended Video

అపానవాయువును అడ్డుకునేలా పూర్తిస్థాయిలో ప్యాంట్లు ధరిస్తే కరోనావైరస్ ఎట్టి పరిస్థితుల్లో పక్కవ్యక్తికి సోకే ప్రమాదం లేదని వెల్లడించి కాస్త ఊరటనిచ్చే మాటలు చెప్పారు. అదేసమయంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ప్యాంట్ ధరించకుండా అపానవాయువును పెద్ద ఎత్తున విడుదల చేస్తే ఆ పరిసరాల్లో ఉన్న వ్యక్తులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications