వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింప్లిసిటీ: నన్ను వీఐపీలా చూడకండి... సిరియా అధ్యక్షుడు బషర్ కుమారుడు హఫీజ్

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడికే ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తను ఎక్కడికి వెళ్లినా ఆ వీఐపీ ట్రీట్‌మెంట్ ఉంటుంది. స్కూలుకు వెళ్లినా... సినిమాకు వెళ్లినా.. అదే తరహా ట్రీట్‌మెంట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడికే ఇంతటి ప్రాధాన్యత ఉంటే ఒక దేశాధ్యక్షుని కుమారుడికి ఇంకెంత ప్రాధాన్యత, ఇంకెంత వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఉంటుంది..? కానీ ఇక్కడ ఓ దేశాధ్యక్షుడి కుమారుడు మాత్రం నాకు వీఐపీ ట్రీట్‌మెంట్ వద్దని చెబుతున్నాడు. అందరిలానే తనను ట్రీట్ చేయాలని చెప్పి ప్రశంసలందుకుంటున్నాడు. ఇంతకీ ఆ దేశాధ్యక్షుడు ఎవరు ఆయన కొడుకు ఎవరనేగా మీ డౌటు... ఆయనే సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్.

సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుమారుడు హఫీజ్ అల్ అసద్‌కు 16 ఏళ్లు. ఇంకా చదువుకుంటున్నాడు. రొమానియాలో జరుగుతున్న మ్యాథ్స్ ఒలంపియాడ్‌కు ఎంపికయ్యాడు. అయితే ఒక దేశాధ్యక్షుడు కుమారుడు ఓ పోటీలో పాల్గొనేందుకు వెళుతుండగా ఆయన వెంట ఎలాంటి సరంజామా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడే హఫీజ్ తన మనసును చాటుకున్నాడు. అందరితోనే తను అంటూ చెప్పాడు. అందరిలానే తనను కూడా సాధారణ వ్యక్తిలా చూడాలని కోరుతున్నాడు. గతేడాది బ్రెజిల్‌లోని రియోడిజానేరో మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో పాల్గొన్న హఫీజ్ 528 స్థానంతో సరిబెట్టుకున్నాడు. ఇందులో మొత్తం 615 మంది పాల్గొన్నారు.

Treat me like anyother normal person,says syrian Presidents son

ఒక వీఐపీలా కాకుండా తనను అందిరిలానే చూడాలని కోరుకోవడం హఫీజ్‌ గొప్పతనాన్ని చాటుతుందని... అందరిలానే ఆ అబ్బాయి కూడా సాధారణ హోటల్ గదుల్లోనే బస చేసినట్లు స్కూలు ఇన్స్‌పెక్టర్ చెప్పారు. మొత్తం 18 దేశాల నుంచి మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో పాల్గొనేందుకు పిల్లలు వచ్చినట్లు చెప్పిన ఇన్స్‌పెక్టర్ హఫీజ్ వారితో కలిసిపోయాడని వివరించాడు.

రొమానియా మీడియా కథనాల ప్రకారం సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కొడుకు పోటీలో పాల్గొంటున్నందున భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అక్కడి అధికారులు. సిరియాలో దౌత్యకార్యాలయాలున్న అతికొద్ది దేశాల్లో రొమానియా కూడా ఒకటి. సిరియన్ విద్యార్థులకు రొమానియా దేశం ఒక స్వర్గధామంగా నిలిచిందని చెప్పొచ్చు. చాలా మంది సిరియన్ విద్యార్థులు ఇక్కడ చదివి డిగ్రీ పట్టాను పొందారు.

English summary
The teenage son of Syrian president Bashar al-Assad is competing in the International Mathematical Olympiad in Romania, where he has asked to be treated like any normal student, an education official said Tuesday.Hafez al-Assad, 16, is one of 615 students participating in the annual competition, which this year is being held in the central town of Cluj-Napoca until Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X