ట్రక్కు బీభత్సం: 12మంది మృతి, 50మందికి గాయాలు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌ చేసుకుందామని మార్కెట్‌కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.

బెర్లిన్‌: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌ చేసుకుందామని మార్కెట్‌కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.

Truck runs into Berlin's Christmas market: Death toll rises to 12

మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్‌లోని కైసెర్‌ విల్హెమ్‌ మెమోరియల్‌ చర్చికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్‌ పండుగ సమీపిస్తుండంతో మార్కెట్‌ అంతా పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+