ప్రపంచ యుద్ధంతో బ్రేకప్: ప్రేమించుకున్న 70ఏళ్లకు పెళ్లి!

లండన్: ఓ ప్రేమ జంట.. ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 70 ఏళ్ల తర్వాత వివాహ బంధంతో ఏకమవుతోంది. ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఈప్రేమ జంటే బ్రిటన్‌కు చెందిన రాయ్ వికర్‌మ్యాన్(90), నోరా జాక్సన్(89)లు.

ఆ జంట ప్రేమ కథలోకి వెళితే.. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న బ్రిటన్ సైనికుడు రాయ్ వికర్ 1940లో నోరా జాక్సన్‌ను తొలిసారి కలిశాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో 1946లో వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

కాగా, కొద్ది రోజుల్లో వివాహం చేసుకుందామని భావించారు. ఇంతలో యుద్ధం కారణంగా రాయ్ అనారోగ్యం పాలయ్యాడు. తర్వాత వారిద్దరూ విడిపోయారు. అనంతరం కొంత కాలానికి ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు.

True love exists: Couple split by World War II 70 years ago set to marry now

అయితే, రాయ్ తన ప్రియురాలిని మాత్రం మర్చిపోలేకపోయాడు. ఈ క్రమంలో రాయ్ తన భార్య మరణించడంతో ఒంటరిగా మిగిలాడు. కాగా, స్థానిక రేడియో సహాయంతో తన ప్రేయసి గురించి తెలుసుకున్నాడు. తనకు కేవలం రెండు మైళ్ల దూరంలో ఉందని తెలియడంతో వెంటనే వెళ్లి ఆమెను కలిశాడు.

ఆమె భర్త మరణించి ఆమె కూడా తనలా ఒంటరిగా ఉందని గుర్తించాడు. దీంతో తన 90వ ఏట గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రేమకు పూర్తి రూపమిస్తూ పెళ్లి ప్రతిపాదన చేశాడు. దీనికి ఆమె కూడా అంగీకరించడంతో పాత ప్రేమికులు కొత్త దంపతులు కానున్నారు. త్వరలోనే వారి వివాహం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+