వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా వెళ్లొద్దు.. ఉన్న వాళ్లు కూడా వచ్చేయండి: ట్రంప్ ఆదేశాలు

ఉత్త‌ర కొరియాలో అమెరిక‌న్ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని, అక్క‌డ నివ‌సిస్తున్న ప్ర‌వాస అమెరిక‌న్లంతా వెంట‌నే తిరిగి అమెరికా వెళ్లిపోవాలంటూ ఉత్త‌ర కొరియాలోని అమెరికా దౌత్య కేంద్రం ప్ర‌క‌టించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్త‌ర కొరియాలో అమెరిక‌న్ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని, అక్క‌డ నివ‌సిస్తున్న ప్ర‌వాస అమెరిక‌న్లంతా వెంట‌నే తిరిగి అమెరికా వెళ్లిపోవాలంటూ ఉత్త‌ర కొరియాలోని అమెరికా దౌత్య కేంద్రం ప్ర‌క‌టించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకే ఈ ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.

అమెరికా దౌత్యాధికారి రే టెల్లార్స‌న్ పేరు మీద విడుద‌లైన ఈ ప్ర‌క‌ట‌న‌లో.. భ‌విష్య‌త్తులో కూడా అమెరిక‌న్లు ఉత్త‌ర కొరియా వెళ్ల‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. అక్క‌డ ఇటీవ‌ల ఓటో వాంబియార్ అనే అమెరిక‌న్ పౌరుడి మ‌ర‌ణం త‌న‌ను క‌ల‌చివేసింద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు దౌత్యాధికారి రే టెల్లార్స‌న్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Trump admin announces travel ban to North Korea

జూలై 27 నుంచి స‌రిగ్గా 30 రోజుల్లోగా ఉత్త‌ర కొరియాలో ఉండే అమెరిక‌న్లంతా స్వ‌దేశానికి రావాల‌ని, లేకపోతే వారి పాస్‌పోర్టుల‌ను పున‌రుద్ధరించేది లేద‌ని రే స్ప‌ష్టం చేశారు. అలాగే జూలై 27 త‌ర్వాత ఉత్త‌ర కొరియాకు అమెరికన్లు ఎవరూ వెళ్లరాదని, ఒకవేళ తమ హెచ్చరికలను కాదని వెళితే వారి ర‌క్ష‌ణ‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం ఉండదని కూడా రే ఆ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు.

దీనిపై ఉత్త‌ర కొరియా విదేశాంగ శాఖ కూడా స్పందిస్తూ.. అమెరికాతో దౌత్య సంబంధాలను కొన‌సాగించే యోచ‌న‌లో తాము కూడా లేమ‌ని, జూలై 27 కంటే ముందు కూడా వెళ్లిపోవాల‌నుకునే వారు వెళ్లిపోవ‌చ్చ‌ని, ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌కు బెదిరేది లేద‌ని తెలిపింది.

English summary
The Trump administration announced a travel ban on Friday for Americans traveling to North Korea, according to the State Department. The ban will go into effect 30 days after the restriction is made in the Federal Register, according to the department. The ban comes as tensions between North Korea and the U.S. have risen in the wake of North Korea's growing nuclear weapons program and the death of U.S. student Otto Warmbier, who was detained in North Korea. U.S. citizens looking to go to North Korea for humanitarian purposes will be able to apply through the State Department. The Associated Press reported in June that Secretary of State Rex Tillerson was considering the ban in March when American Tony Kim was detained by the regime, but his consideration of the ban became more urgent after Warmbier’s death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X