అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్..?
అమెరికాకు వెళ్లి డబ్బు సంపాదించాలి అని భారత్ లో చాలా మంది యువత కల. వీరిలో మధ్య తరగతి కుటుంబం నుంచే అనేక మంది యువత అగ్రరాజ్యానికి క్యూ కడుతుంటారు. ఏదోపని చేసి ఇంటికి డబ్బు పంపించాలనేది వారి లక్ష్యం. అయితే అలాంటి లక్షల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికాలో విదేశాలకు పంపే డబ్బు(రెమిటెన్స్)పై పన్ను పెంచుతూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రెమిటెన్స్ పై 5 శాతం పన్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా యేతర పౌరులపై భారం మోపే దిశగా ట్రంప్ సర్కార్ ఈ చర్యలు తీసుకుంది.
ట్రంప్ నిర్ణయంతో అమెరికాలోని భారతీయులు తల పట్టుకున్నారు. తమ ఇళ్లకు డబ్బు పంపే ఎన్నారై లపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్న క్రమంలో భారతీయులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా H1B వీసాపై పని చేయడానికి అక్కడికి వెళ్లిన ప్రతి విదేశీయుడికి ఈ నిర్ణయం వర్తించనున్నట్లు సమాచారం. ఇక అమెరికా పౌరసత్వం పొందిన వారిపై ఎలాంటి పన్ను ఉండదని సమాచారం.
ట్రంప్ తీసుకోనున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితం అవుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో లక్షలాదిమంది భారతీయులు ఉన్నారు. వీరంతా వివిధ స్టడీస్ కారణంతో అమెరికాకు వెళ్లారు. వీళ్లపై ఈ రెమిటెన్స్ ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం అమెరికా నుంచి భారత్ కు అందుతున్న రెమిటెన్స్ గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. 2010లో 55.6 బిలియన్ డాలర్లు గా ఉన్న రెమిటెన్స్.. 2023-24 నాటికి 118.7 బిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. మరోవైపు వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం అత్యధిక రెమిటెన్స్ లు అందుకుంటున్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. 2024 నివేదిక ప్రకారం అమెరికాలో 50 లక్షలకు పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు అమెరికా సెన్సస్ బ్యూరో పేర్కొంది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!











Click it and Unblock the Notifications