వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఈ అర్హతలుంటే చాలు అమెరికా స్వాగతిస్తుంది’: తేల్చిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఈ అర్హతలుంటే చాలు అమెరికాకి రావచ్చు.. తేల్చిన ట్రంప్..!

వాషింగ్టన్‌: అమెరికా తన వలస విధానాలను మార్చేయడంతో ఆ దేశానికి వెళ్లాలనుకున్న విదేశీ విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. అయితే, ఇందుకు అమెరికా కొన్ని మినహాయింపులను ఇప్పుడు ప్రకటించింది.

భారత టెక్కీలకు కష్టకాలమే: హెచ్1బీ వీసా మరింత కఠినతరంభారత టెక్కీలకు కష్టకాలమే: హెచ్1బీ వీసా మరింత కఠినతరం

కాగా, ఇటీవల వలసలపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని 'చెత్త దేశాల' నుంచి వచ్చే వలసలు తమకు అవసరం లేదంటూ ట్రంప్‌ తేల్చి చెప్పారు.

 అభ్యంతరం లేదంటూ ట్రంప్

అభ్యంతరం లేదంటూ ట్రంప్

అయితే, ట్రంప్‌ పేర్కొన్న దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాము వలసలకు వ్యతిరేకం కాదంటూ ట్రంప్‌ సర్కార్‌ మరోసారి స్పష్టం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే అమెరికాకు వచ్చే వలసదారులకు కొన్ని నైపుణ్యాలుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది.

 ఈ మూడుంటే చాలు..

ఈ మూడుంటే చాలు..

నైపుణ్యం, ఉద్యోగం, అనర్గళంగా ఆంగ్లభాషను మాట్లాడే సామర్థ్యం ఉన్నవారు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా తమ దేశానికి వలస రావొచ్చంటూ ట్రంప్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు. వీసా జారీల్లో ప్రతిభ ఆధారిత విధానం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇలాంటి పాలసీ గనుక అమల్లోకి వస్తే భారత్‌ లాంటి దేశాలకు చెందిన వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

 ఇలాంటి వారికే వీసాలు

ఇలాంటి వారికే వీసాలు

‘అమెరికా అంటే ఇష్టం ఉన్నవారు.. అమెరికా ప్రజలపై ప్రేమ ఉన్నవారు.. మంచి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారు.. ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడేవారు.. మా విలువలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసేవారు.. ఏ దేశం వారైనా అలాంటి వారికి వీసాలు ఇవ్వాలని భావిస్తున్నాం' అని ఆ అధికారి చెప్పారు.

 అలాంటివారు అవసరం లేదు

అలాంటివారు అవసరం లేదు

ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను చేపట్టేవారు, అందుకు కుట్ర పన్నేవారు, అలాంటి చర్యలకు మద్దతిచ్చేవారు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. తమ దేశ లక్ష్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమేనని స్పష్టం చేశారు. వలసల విధానంలో సంస్కరణలు చేపట్టాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తోందని సదరు అధికారి పేర్కొన్నారు.

English summary
The Trump administration wants to admit immigrants who have skills, talent and can speak English, a top official has said, giving insight into the proposed merit-based system that may benefit individuals from countries like India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X