నో డెడ్ లైన్: డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో ఇంకొకటి.. !!

దాదాపు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే కనిపిస్తోన్నాయి. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్‌కు చెందిన కౌంటర్‌పార్ట్ వొలొడిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నివాసంలో ఈ ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. 20 పాయింట్స్ ఫార్ములా, శాంతి ఒప్పందాలు సహా పలు అంశాలపై చర్చించారు. మూడు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది.

అనంతరం జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ డిమాండ్ కు అనుగుణంగా 95 శాతం సెక్యూరిటీ గ్యారెంటీలు పూర్తి అయినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్ భూభాగం, ముఖ్యంగా డాన్‌బాస్ విషయంలో ఇంకా కొన్ని కీలక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. గతంలో కంటే భిన్నంగా ఈ చర్చలు సాగాయని, చాలా అంశాలపై చర్చించామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధం ముగింపునకు చాలా దగ్గరగా ఉన్నామని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Trump and Zelenskyy Reveal Near-Complete 20-Point Peace Plan and Settled Security Guarantees

ఈ ప్రక్రియకు ఎటువంటి గడువు విధించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించట్లేదని, తనకు అనుకూలంగా ఫలితాలు రానప్పుడు మళ్లీ యుద్ధాన్ని పునః ప్రారంభించడం ఆయనకు ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఉక్రెయిన్‌ను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నానని, ముందుగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతానని ట్రంప్ స్పష్టం చేశారు.

జెలెన్‌స్కీ అవసరమని భావిస్తే ఉక్రెయిన్ పార్లమెంట్‌లో ప్రసంగించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. ఈ సమావేశం పట్ల జెలెన్‌స్కీ సంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత శాంతిని సాధించడంలో సెక్యూరిటీ గ్యారంటీలు కీలకమైనవని, వాటని 90 శాతం వరకు సాధించామని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. మిగిలిన అంశాలపై ఉక్రెయిన్, యూరోపియన్ దేశాలతో చర్చించాల్సి ఉందని, దీని తర్వాత అన్ని విషయాలను ఖరారు చేయడానికి మరోసారి సమావేశమౌతామని ఆయన తెలిపారు.

ట్రంప్ తో తదుపరి చర్చలు జనవరిలో ఉండొచ్చని చెప్పారు. రష్యా ఆధీనంలోకి వెళ్లిన డాన్‌బాస్ పై తన వైఖరిని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ఆ భూమి ఇప్పటికీ తమ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. యుద్ధం ఎంతకాలం సాగుతుందనే ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు. ముగింపునకు దగ్గర్లో ఉన్నామని, కొన్ని వారాల్లో పరిష్కరారమౌతుందని, దీని ఫలితం ఎలా ఉంటుందనేేది తాను ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో అమెరికా, ఉక్రెయిన్, రష్యా కలిసి చర్చల్లో పాల్గొంటాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+