కన్జర్వేటివ్ స్టార్ కామెంటేటర్ జకారియాకు వైట్‌హౌస్ లో కీలక పదవి..

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ లో కీలక మార్పు చోటు చేసుకుంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీగా కన్జర్వేటివ్ కామెంటేటర్, సీనియర్ అడ్వొకేట్ కేటీ జకారియాను నియమితులయ్యారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ పదవి నుంచి వైదొలిగిన కరోలినా లీవిట్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. పాలనా వ్యవహారాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రెస్ సెక్రెటరీ బాధ్యతలను ఆమెకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైట్‌హౌస్ లో ఎప్పటికప్పుడు విలేకరుల సమావేశాలను నిర్వహించడం, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను స్పష్టంగా వివరించడంలో ప్రెస్ సెక్రెటరీ హోదా.. అత్యంత కీలకం. ఇదివరకు కరోలినా లీవిట్ ఈ పదవిలో పని చేశారు. డొనాల్డ్ ట్రంప్ రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన ప్రారంభ రోజుల్లోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ట్రంప్ క్యాంప్ లో కీలకంగా వ్యవహించారు. ఆయనకు అత్యంత నమ్మకస్తురాలిగా లీవిట్ కు పేరుంది.

Trump announced appointment of conservative commentator Katie Zacharia White House press secretary

ఈ ఏడాది మే లో ఆమె రెండో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరు పిల్లలు, కుటుంబానికి ఎక్కవ సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో ప్రెస్ సెక్రెటరీ పదవి నుంచి తప్పుకొన్నారు. వచ్చే నవంబర్ నుంచి లీవిట్.. ఫాక్స్ న్యూస్ ఛానెల్‌లో ఆన్ ఎయిర్ కాంట్రిబ్యూటర్‌గా చేరనున్నారు.

ఆ వెటరన్ హీరోకు గుడ్ బై చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్- తెగిన సుదీర్ఘ బంధం
ఆ వెటరన్ హీరోకు గుడ్ బై చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్- తెగిన సుదీర్ఘ బంధం

ఇప్పుడీ స్థానాన్ని జకారియా భర్తీ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మూమెంట్ కు ఆమె మద్దతుదారు. ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ సొంత మీడియా సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో సీనియర్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా పని చేశారు. చట్టాలు, రాజకీయ రంగాల్లో విస్తృత అనుభవం ఉందామెకు. పెప్పర్‌డైన్ యూనివర్శిటీ నుంచి లా లో పట్టా అందుకున్నారు. 2006లో రిపబ్లికన్ నేషనల్ కమిటీలో ఇంటర్న్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఇతడో మాన్‌స్టర్..: ట్రంప్ స్ట్రేంజ్ కాంప్లిమెంట్ కు బిక్కమొహం వేసిన సుందర్ పిచాయ్
ఇతడో మాన్‌స్టర్..: ట్రంప్ స్ట్రేంజ్ కాంప్లిమెంట్ కు బిక్కమొహం వేసిన సుందర్ పిచాయ్

అనంతరం డెమోక్రాటిక్ ప్రాబల్యం ఉన్న కాలిఫోర్నియాలో కన్జర్వేటివ్ విధానాలను ప్రచారం చేసే ఫిక్స్ కాలిఫోర్నియా సంస్థకు లీగల్ కౌన్సెల్‌గా పనిచేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లోనూ కమ్యూనికేషన్స్ విభాగంలో కీలక పాత్ర పోషించారు. పాలనా వ్యవస్థలతో పాటు మీడియా రంగంలోనూ జకారియాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫాక్స్ న్యూస్, న్యూస్‌మాక్స్ వంటి ప్రముఖ కన్జర్వేటివ్ వార్తా ఛానెళ్లలో ఆమె తరచుగా రాజకీయ విశ్లేషకురాలిగా వ్యవహరిస్తూ వచ్చారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగాలను పర్యవేక్షించే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు కొంతకాలం పాటు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.ఈ సుదీర్ఘ అనుభవంతో ఆమెకు ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది. తన నియామకంపై కేటీ జకారియా స్పందించారు. ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా సేవ చేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+