'బిల్ క్లింటన్ మమ్మల్ని రేప్ చేశాడు, హిల్లరీ నవ్వింది'

వాషింగ్టన్: బిల్ క్లింటన్ తన పైన అత్యాచారం చేశాడని, హిల్లరీ క్లింటన్ కూడా తన పైన ఆరోపణలు చేశారని బ్రాడిక్ వ్యాఖ్యానించింది. బిల్ క్లింటన్ బాధితురాళ్లయిన జుయాటినా బ్రాటిక్, పౌలా జోన్స్, కేతి షెల్టన్, కేథలిల్ విల్లేలతో కలిసి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

గడిచిన కొద్ది రోజుల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు సంబంధించిన టేపులు కొన్ని బయటకు వచ్చాయి. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇదే సమయంలో తన కుమార్తెపై కూడా గతంలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన టేపులు బయటకు వచ్చి సంచలనంగా మారాయి.

Trump appears with Bill Clinton accusers before debate

ఈ నేపథ్యంలో ఆయన పైన విమర్శలు వచ్చాయి. దీంతో ట్రంప్ ఎదురు దాడికి దిగారు. గతంలో బిల్ క్లింటన్ బాధిత యువతులను మీడియఆ ముందుకు తీసుకు వచ్చారు. బిగ్‌ డిబేట్‌ 2కు గంట ముందు ట్రంప్‌ శిబిరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

డొనాల్డ్ ట్రంప్‌ మహిళలపై కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని, బిల్‌ క్లింటన్ తన పైన అత్యాచారం చేశాడని, హిల్లరీ కూడా తన పైన ఆరోపణలు చేశారని బ్రాడ్రిక్‌ వ్యాఖ్యానించారు. విలేకరులు ట్రంప్ పైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మరో బాధితురాలు జోన్స్‌ కల్పించుకున్నారు.

మీరు వేస్తున్న ప్రశ్నలు మొదట బిల్‌ క్లింటన్‌ను అడగాలన్నారు. మరో బాధితురాలు షెల్టన్‌ మాట్లాడుతూ.. బిల్‌ క్లింటన్ తనపై 12 ఏళ్ల వయసులో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం తాను హిల్లరీతో చెప్పినప్పుడు ఆమె పెద్దగా నవ్వారన్నారు. ఆమె ఇప్పుడు తన రేపిస్టు భర్తకు ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+