Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిమ్ ఎఫెక్ట్: ద.కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్

ఉత్తరకొరియాకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టాడు.

Recommended Video

    Donald Trump in Korea : కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్

    సియోల్:ఉత్తరకొరియాకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్య మాటల యుద్దం సాగుతున్న తరుణంలో దక్షిణకొరియాలో ట్రంప్ పర్యటన టెన్షన్ సృష్టిస్తోంది.

    ఇటీవల కాలంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నిర్వహించిన అణు, క్షిపణి పరీక్షలతో ప్రపంచమంతా భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయమై కిమ్ జంగ్‌ఉన్ హెచ్చరించింది. అయినా కిమ్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

    అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాపై యుద్దానికి సిద్దమంటూ సంకేతాలు పంపారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కూడ ఈ విషయమై అమెరికాతో తాడోపేడో తేల్చుకొంటామని చెప్పారు.

    అమెరికాకు ధీటుగానే కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సమాధానమిచ్చారు. అమెరికాలో చిమ్మచీకట్లు కమ్ముకొనేలా చేస్తామని కూడ కొరియా అధినేత హెచ్చరికలు జారీ చేశారు. ఈ రకమైన ఉద్రిక్తతలున్న తరుణంలో ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

     ట్రంప్ టూర్‌తో టెన్షన్

    ట్రంప్ టూర్‌తో టెన్షన్

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం దక్షిణకొరియాలో అడుగుపెట్టారు. తన భార్య మెలానియా ట్రంప్‌తో రాజధాని సియోల్ నగరం చేరుకున్నారు. ఉత్తరకొరియా, అమెరికా మధ్య తీవ్రఉద్రిక్తల నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్‌కు సమీపంలో, సరిహద్దుదేశమైన దక్షిణకొరియాలో ట్రంప్ అడుగుపెట్టారు.కిమ్ ఎప్పుడు ఏం చేస్తారోననే ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

     ఏ క్షిపణినైనా ధ్వంసం చేస్తాం

    ఏ క్షిపణినైనా ధ్వంసం చేస్తాం

    అమెరికా సహకారంతో ఏ క్షిపణినైనా జపాన్ ధ్వంసం చేయగలదని సోమవారం ప్రకటించింది. దక్షిణకొరియా ప్రధాని మూన్ జా ఇన్‌తో ట్రంప్ సమావేశమవ్వనున్నారు. వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన పలు కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. జపాన్‌లో గడిపిన సమయంలో సగం మాత్రమే దక్షిణకొరియాలో ట్రంప్ గడపనున్నారు.

     దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటనకు భారీ భద్రత

    దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటనకు భారీ భద్రత

    దక్షిణకొరియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కనీవినీ రీతిలో భద్రను కల్పించారు. సియోల్ నగరానికి 50 కి.మీ పరిధిని అమెరికా ఆధీనంలోకి తీసుకున్నారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్‌ ఉన్‌కు, అమెరికా అద్యక్షుడు ట్రంప్‌కు మద్య మాటల యుద్దం సాగుతున్న తరుణంలో దక్షిణకొరియాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

     ట్రంప్ పర్యటన వెనుక

    ట్రంప్ పర్యటన వెనుక

    ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. ఈ తరుణంలో ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్ వ్యవహరశైలిపై ప్రపంచదేశాలు ఆందోళనగా ఉన్నాయి. అయితే మూడో ప్రపంచ యుద్దం వస్తోందా అనే అనుమానాలు కూడ వ్యక్తమయ్యాయి. ఉత్తరకొరియా అధినేతకు ట్రంప్ పర్యటనతో చెక్ పెట్టే అవకాశాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఈ తరుణంలో ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటించడం ప్రాధాన్యత కల్గిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చైనా,రష్యాలు కిమ్ తీరును తప్పుబట్టాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+