వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలు నచ్చకుంటే బయటకు వచ్చేస్తా: డొనాల్డ్ ట్రంప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చల సందర్భంగా తనకు నచ్చని విషయం ఉంటే తాను ఏమాత్రం సంకోచం లేకుండా బయటకు వచ్చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా, ఉత్తర కొరియా చర్చలకు సిద్ధమవుతున్నాయి. జూన్‌ ప్రారంభంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దీనికి సంబంధించి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. తనకు చర్చలు ఆశాజనకంగా కనిపించకపోతే ఈ సమావేశంలో పాల్గొనని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య సమావేశం అంచనాలకు తగినట్లు లేకుంటే తాను వెంటనే బయటకు వచ్చేస్తానని ఆయన అన్నారు.

 Trump bullish on North Korea talks, but willing to walk away

అణ్వస్త్ర రహిత అంశంపై చర్చలు జరగనున్నట్లు ట్రంప్ చెప్పారు. చర్చలతో ఫలితం లేవని తెలిస్తే తాను బయటకు వచ్చేస్తానని చెప్పారు. అసలు ముందే తెలిస్తే చర్చలకే వెళ్లనని చెప్పారు. ఫ్లోరియాలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ పైవిధంగా మాట్లాడారు. ఒకవేళ సమావేశం జరిగేప్పుడు అది ఆశాజనకంగా అనిపించకపోతే గౌరవ ప్రదంగా సమావేశం నుంచి వెళ్లిపోతానని చెప్పడం గమనార్హం.

English summary
President Donald Trump offered a bullish view on Wednesday of his planned talks with North Korean despot Kim Jong Un, insisting he's positioned to accomplish what his predecessors could not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X