'కిమ్' ఓ పిచ్చోడు, మాటవినకపోతే కొరియాపై అణుబాంబుతో దాడి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. మొన్నటి దాకా ఏ నోటితోనైతే ఉత్తరకొరియా అదినేత కిమ్ జాంగ్ ఉన్ ను పొగిడారో.. అదే నోటితో మళ్ళీ తిట్లపురణాం మొదలెట్టారు.
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. మొన్నటి దాకా ఏ నోటితోనైతే ఉత్తరకొరియా అదినేత కిమ్ జాంగ్ ఉన్ ను పొగిడారో.. అదే నోటితో మళ్ళీ తిట్లపురణాం మొదలెట్టారు.
కిమ్ ...అణుబాంబులు చేతపట్టుకొన్న పిచ్చోడు అని దూషించాడు. ఈ మేరకు ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తీతో ట్రంప్ జరిపినో ఫోన్ సంబాషణను అమెరికన్ వార్తాపత్రికలు రట్టు చేయడం. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
కొన్నిరోజుల క్రితం కిమ్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఒక దశలో ఉత్తరకొరియా నేతతలో చర్చలు జరపబోతున్నట్టు ఆయన చెప్పారు. అయితే అందుకు విరుద్దంగా ఇప్పుడు కిమ్ పై విమర్శలు గుప్పించారు.

ఉత్తరకొరియా దగ్గరున్న అణ్వాయుధాలకంటే 20 రెట్లు ఎక్కువ ఆయుధాలు తమ దగ్గరున్నాయని కిమ్ ను క్షనాల్లో అంతం చేయగల సత్తా ఉన్న అమెరికా ఆ పని చేయబోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిమ్ కు మతిచెడింది. ఏ క్షణంలోనైనా ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అమెరికన్ పత్రికలు వెల్లడించాయి.
కిమ్ ను కట్టిడిచేసేలా చైనాపై ఒత్తిడి తేవాలని (ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు) ట్రంప్ ను కోరారు. చైనా గనుక ఉత్తరకొరియాకు మద్దతు ఉపసంహరించుకొంటే కిమ్ పని అయిపోయినట్టే. మీరు ఒకసారి చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో మాట్లాడి చూడండి. మాట వింటే పని సులువైనట్లేని చెప్పాడు.వినకపోతే తామే కిమ్ మెడలు వంచుతామని ట్రంప్ చెప్పాడు.
అప్పటికీ కిమ్ వినకపోతే కొరియాపై అణుబాంబులు వే్స్తామని ట్రంప్ హెచ్చరించారు. కానీ, అది ఏ ఒక్కరికి మంచిది కాదని ట్రంప్ ఫోన్ సంభాషణను అమెరికా పత్రికలు వివరించారు.












Click it and Unblock the Notifications