ట్రంప్ చిలిపి చేష్టలు..! ఏకంగా జీ20 సదస్సులో పరాచకం..!!

ఒసాకా/హైదరాబాద్: ఎంత పెద్ద స్ధాయిలో ఉన్నా సమాయాన్ని బట్టి కొన్ని సార్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటాం. అది మనిషి సహజ గుణం. ఎదుటి వాళ్లను ఆటపట్టించడానికి కొంత హాస్యాస్పదంగా, కొంత పసితనంగా అప్పుడప్పుడూ వ్యవహరిస్తుంటాం కూడా. మన స్నేహితులు, సన్నిహితులు అలా చేయడం సర్వ సాదారణం. కాని అగ్ర దేశానికి అద్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా తనలో ఇంకా చిన్నపిల్లాడున్నాడని చాటుకున్నారు. ఏకంగా జీ20 సదస్సులో తన చిలిపి హృదయాన్ని చాలుకున్నారు. దీంతో సమావేశానికి హాజరైన ప్రతినిధులందరూ కాస్త నవ్వుముఖం పెట్టుకుని, కాసేపు ట్రంప్ గారి చిలిపితనం గురించి చర్చించుకున్నట్టు అక్కడ రికార్డైన విడియోలు నిర్ధారిస్తున్నాయి.

Trump comedy things At the G20 summit..!!

ట్రంప్‌ నిస్సందేహంగా విభిన్నమైన అధ్యక్షుడు. సాధారణంగా అమెరికా పాలకులు ప్రదర్శించే గాంభీర్యాన్ని ఆయన ప్రదర్శించరు. నలుగురు నేతలు కలిసిన చోట ఉల్లాసంగా ఉండేందుకు విభిన్నంగా ఏదో ఒకటి చేయటం ఆయనకు పరిపాటే. కొన్ని సందర్భాల్లో ఇవి శృతి మించి వివాదాలకు దారి తీస్తే.. మరికొన్ని సార్లు నవ్వులు పూయిస్తాయి. ఇటీవల జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌)ను సరదాగా ఆటపట్టించారు. ఇటీవల జరిగిన సదస్సు విరామ సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. సౌదీయువరాజు ఎంబీఎస్‌ తన సీటులో కూర్చొని ఉండగా.. ఆ వెనుక నుంచే ట్రంప్‌ ఎంబీఎస్‌ భుజాన్ని తట్టి.. ఆగకుండా తన స్థానం వైపు వెళ్లిపోయారు. తనను ఎవరు తట్టారో అర్థం కాక ఎంబీఎస్‌ కొన్ని క్షణాలు గందరగోళానికి గురయ్యారు. తర్వాత ఆ పని చేసింది ట్రంప్‌ అని అర్థం చేసుకొని నవ్వుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+