వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంఖనం దివ్యౌషధం: అమెరికన్ ఫస్ట్ పాలసీపై ట్రంప్ సర్కార్ ఇలా..

బ్బు చేస్తే కొన్ని రోజులు ఉపసం ఉంటే అదే తగ్గిపోతుందని గతంలో నానుడి మరి. డొనాల్డ్ ట్రంప్ మొన్నమొన్నటి వరకు ‘ఫస్ట్ అమెరికన్’ పాలసీకి ప్రాధాన్యం ఇస్తామని పదేపదే ప్రకటించారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: లంఖనం దివ్యౌషధం అని అన్నారు పెద్దలు. జబ్బు చేస్తే కొన్ని రోజులు ఉపవాసం ఉంటే అదే తగ్గిపోతుందని గతంలో నానుడి మరి. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం మొదలు దేశాధినేతగా అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మొన్నమొన్నటి వరకు 'ఫస్ట్ అమెరికన్' పాలసీకి ప్రాధాన్యం ఇస్తామని పదేపదే ప్రకటించారు. కానీ ఆచరణలో ఇబ్బందులు తలెత్తడంతో క్రమంగా 'అమెరికన్ ఫస్ట్' నినాదానికి సవరణలు తీసుకొస్తోంది.

అందులో భాగంగానే తక్కువ వేతనాలు ఉన్న విదేశీ కార్మికుల కోసం ఒకేసారి 15వేల అదనపు హెచ్‌2బీ వీసాలను ట్రంప్‌ సర్కారు ప్రకటించింది. తాత్కాలిక వ్యవసాయేతర కార్మికుల కొరత కారణంగానే ఈ వీసాల సంఖ్యను భారీగా పెంచినట్లు అమెరికా అంతర్గత భద్రత శాఖ వెల్లడించింది. వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది.

‘అమెరికన్ ఫస్ట్‘ నినాదానికి ఇలా సవరణ

‘అమెరికన్ ఫస్ట్‘ నినాదానికి ఇలా సవరణ


ఈ వీసాలను విదేశీ వ్యవసాయ కార్మికులకు ఇస్తారు. అమ్యూజ్మెంట్ పార్కులు, హోటళ్లు, ల్యాండ్ స్కేప్ కంపెనీల వ్యాపార ప్రయోజనాల కోసం కొరత నివారణకు ఈ చర్యలు చేపట్టింది. ఇందులో ట్రంప్ యాజమాన్యంలోని హోటళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా తాత్కాలిక వీసాలు జారీ చేసింది. ఇంతకుముందు విదేశీ నిపుణులను నిలువరించడం కోసమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్' నినాదాన్ని ముందుకు తెచ్చారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ వాదానికి లోబడే తామీ నిర్ణయం తీసుకున్నామని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంసెక్యూరిటీ అధికారులు పేర్కొనడం గమనార్హం.

తాత్కాలికంగా హెచ్2బీ వీసాల జారీ

తాత్కాలికంగా హెచ్2బీ వీసాల జారీ


ప్రస్తుతానికి లాటిన్‌ అమెరికా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను అమెరికా వ్యాపార సంస్థలు తెచ్చుకుంటున్నాయి. స్థానిక అమెరికన్‌ కార్మికులు తాత్కాలిక వ్యవసాయేతర పనులు చేసేందుకు ఆసక్తి చూపకపోవటం.. వ్యాపార రంగంలో కార్మికుల కొరత ఉండటంతో విదేశీ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా ఏటా 66వేల హెచ్‌2బీ వీసాలు జారీ చేస్తుంది. ఈసారి మరో 15వేల వీసాలను అదనంగా ఇవ్వనున్నది. అమెరికా శ్రేయస్సును వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి తమ నిర్ణయం ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు.

వ్యాపారాల బలోపేతానికే హోంలాండ్ సెక్యూరిటీ ఇలా

వ్యాపారాల బలోపేతానికే హోంలాండ్ సెక్యూరిటీ ఇలా


అయితే తాము జారీచేసిన హెచ్2 బీ వీసాలు పొందిన వారిని ట్రంప్ సొంత హోటళ్లలో నియమించుకుంటారన్న విషయం తమకు తెలియదన్నారు. అదనపు హెచ్ 2 బీ వీసాల కోసం ట్రంప్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయా? లేదా? సమాచారం తమకు లేదని తెలిపారు. అదనంగా ఎంత మంది విదేశీ కార్మికులకు హెచ్ 2 బీ వీసాలు అవసరం అన్న సంగతి ఇంకా తేలలేదని హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి జాన్ కెల్లీ పేర్కొన్నారు. హెచ్‌-2బీ కార్యక్రమం కింద తాత్కాలిక ప్రాతిపదికన 15 వేల మంది దాకా ఉద్యోగులను తీసుకోకపోతే అమెరికా వ్యాపారాలు కుదేలయ్యే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికాలో హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సోమవారం తెలిపింది. కాగా, భారత సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు ఎంతో డిమాండ్‌గా ఉండే హెచ్‌-1బీ వీసాల మంజూరుపై కాంగ్రెస్‌ కమిటీ 65 వేలకు పరిమితి విధించింది. ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాల విధానాన్ని పునస్సమీక్షించనున్నది. అమెరికాలో బాగా నైపుణ్యం గల నిపుణుల కొరత తీవ్రంగా ఉన్నందున.. వీసాల సీలింగ్‌ను పెంచాల్సిందిగా సిలికాన్‌ వ్యాలీలోని అనేక కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

రిపబ్లికన్ సెనెటర్ల వల్లే బిల్లు ఓటమి

రిపబ్లికన్ సెనెటర్ల వల్లే బిల్లు ఓటమి

ఒబామా కేర్‌ రద్దు తీర్మాన బిల్లు అమెరికా సెనేట్‌ ఆమోదం పొందలేదు. దీంతో అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై వరుస వరుసగా అనేక ట్వీట్లలో ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒబామాకేర్‌ను రద్దు చేసే ప్రయత్నాలు విఫలం కావడానికి డెమొక్రాట్లు, తమ సొంత పార్టీలోని కొంతమంది సెనేటర్లే కారణమని నిందించారు. ‘‘డెమొక్రాట్లంతా, కొంతమంది రిపబ్లికన్లు మమ్మల్ని ముంచారు. మెజారిటీ రిపబ్లికన్లంతా ఎంతో కష్టించి చిత్తశుద్ధితో పనిచేశారు. మళ్లీ మేము విజయం సాధిస్తాం'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పేదల ఆరోగ్యం కోసం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన ‘ఒబామా కేర్' బిల్లు రద్దునకు ప్రతిపాదించిన బిల్లును ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు వ్యతిరేకించడమే దీనికి కారణం. దీంతో సెనెట్‌లో బిల్లు ఆమోదం పొందడానికి అవకాశాలు లేవు. ‘ఒబామా కేర్' రద్ధు ప్రయత్నం విఫలం కావడంతో ప్రత్యామ్నాయ హెల్త్ కేర్ ప్లాన్ స్వచ్ఛంగా అమలు జేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని రిపబ్లికన్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఒబామా కేర్ పథకం 2010లో ఆమోదం పొందింది.

English summary
The Trump administration has expanded the meaning of “America First” to include foreign workers willing to take on low-skill work. Citing a shortage of “qualified and willing” Americans to meet the high-season needs of businesses like landscape companies, amusement parks, and hotels, the US Department of Homeland Security (DHS) said it will increase the number of available H2B visas for non-farm temporary workers by 15,000 for fiscal year 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X