US President Election 2024: ట్రంప్ కేబినెట్‌లో మస్క్..ఆశాఖను కోరుకున్న టెస్లా అధినేత..!

అమెరికా ఎన్నికలకు మరో కొన్ని నెలలు సమయం ఉండగా అప్పుడే అక్కడ హీట్ పెరిగిపోతోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలో ఉండటంతో ఈ వేడి మరింత కాక పుట్టిస్తోంది. ఓవైపు కమలా హారిస్ మరో వైపు ట్రంప్ తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక తాజాగా ట్రంప్ నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. ట్రంప్ ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే ఆయన కేబినెట్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి చోటు కల్పించనున్నట్లు ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..?

అమెరికా ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు చర్చాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్కడ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఒక పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు, అదే సమయంలో కేబినెట్ నియామకాలపై తన మనసులో మాటను పంచుకున్నారు.

Trump Considers Musk for Cabinet Role Tesla CEO Names Ideal Department

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ప్రస్తుతం ఉన్న 7500 డాలర్ల పన్ను రుణం గురించి ట్రంప్ మాట్లాడారు.టాక్స్ క్రెడిట్స్ మరియు ప్రోత్సాహకాలు ఇవ్వడం మంచివికావనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పారు.ఇక టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ట్రంప్ పంచుకున్నారు. ఈ మధ్యే ఎక్స్ వేదికగా మస్క్ ట్రంప్‌ను తన ఇంటర్వ్యూతో ప్రమోట్ చేశారు. అధికారంలోకి వచ్చాక మస్క్‌ను కేబినెట్‌లో చేర్చుకోవడం లేదా సలహాదారుగా నియమిస్తారా అని ప్రశ్నించగా... ఇందుకు ట్రంప్ చాలా పాజిటివ్‌గా సమాధానం చెప్పారు. మస్క్ చాలా తెలివిమంతుడని, తను కేబినెట్‌లో చేరుతానంటే తప్పక తీసుకుంటానని చెబుతూ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ట్రంప్ ఇచ్చిన ఆఫర్ స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మస్క్ ఎక్స్ (ట్విటర్)పై పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై నెటిజెన్లు చిత్ర విచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఏ శాఖలో పనిచేస్తావ్ అంటూ మస్క్‌ను ప్రశ్నించారు.

విద్యుత్ వాహనాలపై ట్రంప్ స్టాండ్

విద్యుత్ వాహనాలపై ట్రంప్ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. విద్యుత్‌తో నడిచే కార్లంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని తెలిపిన మాజీ అధ్యక్షుడు దీనిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం వెల్లడించలేనని పేర్కొన్నారు. ఇక ఇంధనంతో నడిచే వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు ఇలా ఏవైనా సరే వాటిలో ప్రయాణించడం ఇష్టమని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటో ఇండస్ట్రీ విధానాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ వివరించారు.మెక్సికో నుంచి వాహనాల దిగుమతి,అమెరికాలో వాహనాలు అమ్మేందుకు మెక్సికోలో చైనా ఆటోమొబైల్ సంస్థలు ప్లాంట్లు ఏర్పాటు చేయడం వంటి విధానాల్లో మార్పు తీసుకురావాలని ట్రంప్ అన్నారు. మెక్సికో నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాన్ని విధిస్తే.. ఆ కార్లను అమెరికాలోనే తయారు చేసేందుకు సంస్థలు ముందుకొస్తాయని వెల్లడించారు.

విదేశీ ఆటో మొబైల్ సంస్థలు వాహనాలను అమెరికాలో తయారు చేస్తామని ముందుకొస్తే వారిని స్వాగతిస్తామని ట్రంప్ చెప్పారు. వారికి కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని స్పష్టం చేశారు. చైనాతో పాటు ఇతర దేశాలు అమెరికాకు వచ్చి ఇక్కడే వాహనాలను తయారు చేసేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేసి, అమెరికా దేశస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే కచ్చితంగా వారిని స్వాగతిస్తామని ట్రంప్ భరోసా ఇచ్చారు.

చైనా దేశానికి చెందిన టిక్ టాక్ యాప్ పై నిషేధం గురించి ట్రంప్‌ను ప్రశ్నించినప్పుడు.. ఒక యాప్‌ను నిషేధించడం తనకు నచ్చలేదని, వాక్‌స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ అలాంటి యాప్‌ను నిషేధించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.కానీ టిక్ టాక్ మాత్రం తనను ఎక్కడా అవమానించలేదని ట్రంప్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+