అమెరికా-మెక్సికో మధ్య సరిహద్దు గోడ: ఫైల్‌పై ట్రంప్ సంతకం
యూఎస్-మెక్సికో మధ్య 3201కిమీ సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇందులో 1050కిమీ మేర సరిహద్దు ఇనుప కంచె వేశారు. 2006లో ఈ రెండు దేశాల మధ్య గోడకట్టే బిల్లు ఆమోదం పొందింది.
న్యూయార్క్: ఎన్నికల ప్రచారంలో చేసిన హామిలన్నింటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒబామా హెల్త్ స్కీమ్ ను రద్దు చేసిన ఆయన.. తాజాగా అమెరికా-మెక్సికో మధ్య అడ్డుగోడ కట్టే ఫైలుపై సంతకం చేశారు.
కాగా, యూఎస్-మెక్సికో మధ్య 3201కిమీ సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇందులో 1050కిమీ మేర సరిహద్దు ఇనుప కంచె వేశారు. 2006లో ఈ రెండు దేశాల మధ్య గోడకట్టే బిల్లు ఆమోదం పొందింది. దీంతో అప్పట్లో కొంతవరకు గోడ నిర్మాణం జరిగింది. ట్రంప్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫైలుపై సంతకం చేశారు.

ఇదే విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయానికి రంగం సిద్దమైందని, యూఎస్-మెక్సికో మధ్య గోడ కట్టబోతున్నామని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ గోడ నిర్మాణం ద్వారా యూఎస్ లో డ్రగ్, మాఫియా కార్యకలాపాలకు చెక్పెట్టవచ్చునని అమెరికన్ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications