ట్రంప్ మరో సంచలనం: 100 మందికి విముక్తి -స్వీయ క్షమాభిక్షపై మాత్రం వెనక్కి -ఫ్యామిలీకి షాక్

ఇంకొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన పరిపాలన చివరి గంటల్లోనూ సంచలనాలకు తెరలేపనున్నారు. రకరకాల నేరాలు, తప్పులకు పాల్పడిన 100 మందికిపైగా వ్యక్తులకు క్షమాభిక్షపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పాడైపోయిన ఇమేజ్ ను కాస్తయినా కాపాడుకునే ఉద్దేశంతో ఆయనీ చర్యకు సిద్ధమయ్యారు. అయితే..

అధ్యక్షుడిగా తనకుండే విశేషమైన అధికారాలతో 100మందికిపైగా వ్యక్తుల్ని క్షమించాలనుకుంటోన్న ట్రంప్.. తన తప్పులను కూడా ప్రక్షాళన చేసుకునేందుకు 'స్వీయ క్షమాభిక్ష' గురించి తీవ్రంగా యోచించారు. కానీ ఇప్పుడా ఆలోచనపై ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. కేపిటల్ భవంతిపై దాడి ఘటనలో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ తనకు తానే స్వీయ క్షమాభిక్ష పెట్టుకోవడంపై విమర్శలు రావడంతో సదరు ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది..

కేపిటల్ భవంతిపై తన అనుచరుల దాడి ఘటనలో రాబోయే రోజుల్లో ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సిన వీలు లేకుండా 'స్వీయ క్షమాభిక్ష' ప్రసాదించుకునేలా ట్రంప్ తన వ్యక్తిగత సలహాదారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారట. అయితే, దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని, అంతేగాక.. తప్పులను స్వయంగా ఒప్పుకున్నట్లవుతందని వారు ట్రంప్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో..

Trump Doesnt Plan To Pardon Himself As He Preps Expansive List: Report

స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్.. తాను క్షమాభిక్ష పెట్టబోయే 100 మందికిపైగా వ్యక్తుల్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా రాబోయే రోజుల్లో ట్రంప్ ఫ్యామిలీకి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి..

అమెరికాలో దేశాధ్యక్షుడే తనకు తానుగా క్షమాభిక్ష ఇచ్చుకోవాలని అనుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి నుంచే 'స్వీయ క్షమాభిక్ష'పై ట్రంప్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణులతో చర్చించారు. 2018 జూన్‌లోనే దీనిపై ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ''నేను చాలా మంది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపాను. స్వీయ క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు నాకు అధికారాలు ఉన్నాయి'' అని దాంట్లో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని పలువురు అంటున్నారు. ఏ వ్యక్తికి కూడా తన సొంత కేసులో తీర్పు చెప్పుకునే అవకాశం ఉండదని వారు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+