అన్నింటికీ ఇదే తారక మంత్రమా?: మధ్యతరగతిపై ట్రంప్ దెబ్బ

హెచ్ 1 బీ వీసా కింద దరఖాస్తులకు ఆమోదం తేలిగ్గా లభిస్తుండటం వల్ల కూడా ఐటీ సంస్థలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయా? అన్న విషయం గమనించాల్సిందే.

వాషింగ్టన్: వివిధ దేశాల నుంచి అమెరికాలోని టాప్ కంప్యూటర్ ఉద్యోగాల కోసం వచ్చే వారు, వారికోసం ఐటీ కంపెనీలు వినియోగిస్తున్న హెచ్ - 1 బీ వీసాపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. దీనికి కారణాలేమిటి? భారత్‌లోని దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్ 1 బీ వీసా కింద మాత్రమే ఎందుకు అమెరికాకు పంపుతున్నాయి.

ప్రతి సంస్థ కూడా ఈ వీసాకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నది. హెచ్ 1 బీ వీసా జారీకి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో మార్పులు తేవాలని ట్రంప్ భావించడానికి కారణాలేమిటి? ఒక్కసారి పరికించాల్సిందే మరి. డొనాల్డ్ ట్రంప్ రాకతో ఇబ్బంది ముబ్బడిగా హెచ్ 1 బీ వీసాపై అమెరికా వెళ్లి సెటిల్ కావాలని ఆశ పడే వారికి ఇబ్బందికర పరిస్థితులే ముంగిట నిలిచాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన సంస్థలన్నీ తమ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి హెచ్ 1 బీ వీసానే ఉపయోగించుకున్నాయని తెలుస్తున్నది. అమెజాన్, ఒకింత ఐబిఎం మినహా కంప్యూటర్ సేవలు అవసరమైన సంస్థల్లో ప్రధాన సంస్థలే మొత్తం హెచ్ 1 వీసాల్లో అత్యధికంగా 38 శాతం ఉద్యోగులను నియమించుకున్నాయి.

హెచ్ 1 బీ వీసా కింద దరఖాస్తులకు ఆమోదం తేలిగ్గా లభిస్తుండటం వల్ల కూడా ఐటీ సంస్థలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయా? అన్న విషయం గమనించాల్సిందే. టెక్నాలజీ సంస్థలతోపాటు కంప్యూటర్ వ్రుత్తిగా గల టాప్ 20 సంస్థలతో పోలిస్తే 46 శాతం హెచ్ - 1 బీ వీసా పొంది ఉన్నాయి. ఇది స్వయంగా అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇచ్చిన సమాచారం. 2014 ఏప్రిల్ తొలి వారంలో అమెరికా 1,72,500 హెచ్ 1 బీ వీసా అందుకుంటే 2015 అక్టోబర్ నుంచి కూడా కొత్తగా దరఖాస్తులు వచ్చాయి. కానీ ప్రభుత్వం నిర్వహించిన లాటరీ ద్వారా 85 వేల మందిని ఎంపికచేసి మిగతా దరఖాస్తులను తిరస్కరించింది.

మెరిట్ పద్దతిపై వీసాలా

మెరిట్ పద్దతిపై వీసాలా

చాలా తక్కువ దరఖాస్తులు పంపిన చిన్న సంస్థలు విస్త్రుత స్థాయి లాటరీ వ్యవస్థ వల్ల హెచ్ 1 బీ వీసాలు వాటి నిష్పత్తికి అనుగుణంగా పొందలేకపోయాయి. టాప్ సంస్థలతోపాటు చిన్నపాటి సంస్థలు కలిసి 9110 దరఖాస్తులు సమర్పిస్తే కంప్యూటర్ అనుబంధ ఉద్యోగాలు చేస్తున్న వారికి 2015లో 5000లకు పైగా హెచ్ 1 బీ వీసాలు లభించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం వీసాలు పొందేందుకు అమెరికా టాప్ టెక్నాలజీ కంపెనీల సామర్థ్యం పెంపొందించాలని భావిస్తున్నది. ఇప్పటి వరకు హెచ్ 1 బీ వీసా జారీలో ప్రస్తుత విధానానికి ప్రత్యామ్నాయం అమలు చేస్తామని అమెరికా చెప్తోంది. అయితే వ్యవస్థీక్రుతమైన ఉత్తమమైన, మెరుగైన విధానాన్ని అమలులోకి తేవాలని ట్రంప్ సంకల్పించారని తెలుస్తున్నది. అందువల్లే హెచ్ 1 బీ వీసాల జారీ ప్రక్రియను మూలాల స్థాయి నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది.

డేటా సమీకరణలో జెఫ్ సెషన్స్

డేటా సమీకరణలో జెఫ్ సెషన్స్

గత రెండేళ్లుగా హెచ్ 1 బీ వీసా అప్పీళ్లపై వివిధ కేసుల్లో విచారణకు హాజరైన అమెరికా అటార్నీ జనరల్, మాజీ సెనెటర్ జెఫ్ సెషన్స్.. ట్రంప్ రూపొందించనున్న హెచ్ 1 బీ, ఇమ్మిగ్రేషన్ ఫ్లాట్ ఫామ్ వేదికలో కీలక పాత్ర పోషించనున్నారు. ట్రంప్ స్వదేశీ విధాన నిర్ణాయక సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా ఇందులో భాగస్వామి కానున్నారు. హెచ్ 1 బీ వీసాలో సంస్కరణలు తేవాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నది. ఇందుకోసం డిస్నీ, సౌత్రన్ కాలిఫోర్నియా ఎడిసన్, నార్త్ ఈస్ట్ యుటిలిటీస్ (ప్రస్తుతం ఎవర్ సోర్స్) తదితర సంస్థలు.. హెచ్ 1 బీ వీసా పొందుతున్న ఉద్యోగుల విద్యా ప్రమాణాలు, వారిని నియమిస్తున్న సంస్థల వివరాలను సేకరించే పనిలో పడ్డాయి.

పరిమితి ఎత్తేయాలంటున్న ఐటీ సంస్థలు

పరిమితి ఎత్తేయాలంటున్న ఐటీ సంస్థలు

కానీ ఐటీ దిగ్గజాలు మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న (85 వేల మందికి మాత్రమే) హెచ్ 1 బీ వీసా పరిమితిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాము సమస్య పరిష్కారం చూపాలే గానీ ట్రంప్ ప్రభుత్వం కాదని వాదిస్తున్నాయి. విస్త్రుత లాటరీ వ్యవస్థ కంటే మెరిట్ ప్రాతిపదికన హెచ్ 1 బీ వీసా జారీకి ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వీసా హోల్డర్ అమెరికాలో చదివాడా? లేదా? ఆయనగానీ, ఆమె గానీ ఎంత వేతనం పొందుతున్నారన్న ప్రాతిపదిక హెచ్ 1 బీ వీసా జారీకి ట్రంప్ ప్రభుత్వం విధాన రూపకల్పనలో నిమగ్నమైంది. ఇది హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడకుండా పనిచేస్తున్న సంస్థలకు అనుకూలంగా ఉంటుంది. కానీ విదేశీ ఔట్ సోర్సింగ్ సంస్థలను ప్రత్యేకించి భారత ఐటి దిగ్గజాలను ఈ తరహా మార్పులతో కూడిన ప్రతిపాదనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారత ఐటీ ఇండస్ట్రీ గ్రూప్ నాస్కామ్ త్వరలో ట్రంప్ ప్రభుత్వ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నది.

పారదర్శకంగా అమలు చేయాలి

పారదర్శకంగా అమలు చేయాలి

అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కాపాడేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలతో ఎటువంటి సమస్య లేదని, మార్పులు ఉమ్మడి విధానం ప్రాతిపదికన అమలు చేయాలని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతిపాదిత మార్పులతో హెచ్ 1 బీ వీసాలతో సంబంధం లేని కార్పొరేట్లకు మేలు చేస్తుందని, కానీ మిగతా హెచ్ 1 బీ వీసా ఆధారిత సంస్థల పట్ల అత్యధిక స్థాయిలో వివక్షకు దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో నిపుణుల కొరత గురించి తమకు పూర్తిగా అవగాహన ఉన్నదని చంద్రశేఖర్ పేర్కొంటూ అర్హత గల అమెరికన్లతో ఉద్యోగ నియామకాల ప్రయత్నం ప్రతికూల ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. కానీ ట్రంప్ తాజా అటార్నీజనరల్ మాత్రం అమెరికాలో నైపుణ్యానికి కొదవ లేదని పదేపదే సెలవిస్తున్నారు.

కాగ్నిజెంట్ లో ఇలా...

కాగ్నిజెంట్ లో ఇలా...

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో విదేశీ ఉద్యోగుల స్థానే వేల మంది అమెరికన్ల నియామకం పెరిగిపోయిందని అంటున్నారు. విదేశీ సంస్థలు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాట్లకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతేడాది కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికన్లను గణనీయ స్థాయిలోనే నియమించుకున్నది. గతేడాది 4000 మంది అమెరికన్లు, పర్మినెంట్ రెసిడెంట్లను నియమించుకున్న ఈ సంస్థలో అమెరికన్లు ఎంత మంది అన్న సంగతి తెలియదు. కాగ్నిజెంట్ నియమించుకున్న కొందరు ఉద్యోగుల శిక్షణ కోసం మాసోన్ లో ఏర్పాటు చేసిన సెంగేజ్ లెర్నింగ్ సెంటర్ ను తర్వాత భారత్ లో ఉద్యోగుల శిక్షణ కోసం మార్చేసింది.

ఇలా మిడిల్ క్లాస్ పరిస్థితి

ఇలా మిడిల్ క్లాస్ పరిస్థితి

కనుక ట్రంప్ తీసుకొచ్చే మార్పులతో మధ్య తరగతి వర్గంపై గణనీయ ప్రభావం పడుతుందని చెప్తున్నారు. పేస్ హార్మోన్ అనే కన్సల్టెన్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ రుట్చిక్ స్పందిస్తూ హెచ్ 1 బీ వీసాపై ఆంక్షల వల్ల ఐటి పరిశ్రమపై గణనీయ ప్రభావం పడుతుందని తేల్చి చెప్పారు. కొన్ని అంశాల్లో సానుకూల ఫలితాలు పొందొచ్చని చెప్పారు. రోబోటిక్ ప్రాసెస్, క్రుత్రిమ పరిజ్నానం గల వారిని తీసుకోవడం వల్ల విదేశీ ఔట్ సోర్సింగ్ సంస్థలపై ప్రభావం పడుతుందని అన్నారు.

సమస్య పరిష్కారంపై కేంద్రం ఫోకస్

సమస్య పరిష్కారంపై కేంద్రం ఫోకస్

హెచ్ 1 బీ వీసా జారీపై ఆంక్షలు విధించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత టెలీ కమ్యూనికేషన్లు, ఐటీశాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారత ఐటీ పరిశ్రమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. విదేశాంగ వ్యవహారాలశాఖ, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వీసా ప్రోగ్రామ్స్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో తాము అప్రమత్తంగా ఉన్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. అమెరికాలో భారత ఐటీ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

భారత జీడీపీలో 9 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులదే

భారత జీడీపీలో 9 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులదే

విదేశాల్లో హెచ్ 1 బీ వీసా కింద పని చేస్తున్న భారతీయులు సుమారు ఐదు లక్షల మంది ఉంటారు. ఒకవేళ హెచ్ 1 బీ వీసాలో మార్పులు తెస్తే, అధిక వేతనాలు చెల్లించాల్సి రావడంతోపాటు నిపుణుల కొరత ఏర్పడుతుందన్న వాదన ఉన్నది. భారత పారిశ్రామిక రంగంలో 37 లక్షల మంది ఐటీ రంగంలోనే పనిచేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణి భారత ఐటీ పరిశ్రమలకు గుదిబండగా మారనున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

హెచ్ 1 బి వీసా కింద 2015లో అమెరికాలోని టాప్ ఐటి కంపెనీలు చేపట్టిన ఉద్యోగ నియామకాలివి:
టాటా - 4588
కాగ్నిజెంట్ - 3778
అస్సెండర్ - 3227
విప్రో - 3034
ఇన్ఫోసిస్ - 2763
ఐబిఎం - 1893
మహీంద్రాటెక్ - 1495
హెచ్ సిఎల్ అమెరికా - 1222
స్యెంటెల్ - 1061
అమెజాన్ - 1012
మైక్రోసాఫ్ట్ - 872
గూగుల్ - 790
ఎల్ అండ్ టి - 536
డెల్లాయిట్ - 530
కాప్జెమిని - 530
ఐ గేట్ - 508
మైండ్ ట్రీ - 454
ఒరాకిల్ - 387
ఫేస్ బుక్ - 363
యుఎస్ టి గ్లోబల్ - 282

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+