ట్రంప్ సంచలనం: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను తొలగిస్తూ నిర్ణయం..

ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా పదేళ్లు పదవిలో కొనసాగాల్సిన కొమెని.. ట్రంప్ నిర్ణయంతో నాలుగేళ్లకే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

వాషింగ్టన్: గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ గెలుపు కోసం రష్యా తెర వెనుక ఈమెయిల్స్ హ్యాకింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఏఐ) నివేదిక చెబుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ గతేడాది డిసెంబర్ లో దీనిపై కథనాన్ని కూడా వెలువరించింది.

వాషింగ్టన్ పోస్టు కథనంతో అప్పటి అధ్యక్షుడు ఒబామా దీనిపై విచారణకు ఆదేశించినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్-రష్యా సంబంధాలపై ఎఫ్‌బీఐ విచారణ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ ఆ సంస్థ డైరెక్టర్ జేమ్స్ కొమెనిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Trump fires FBI director Comey, raising questions over Russia investigation

విచారణను ప్రభావితం చేసేలా ట్రంప్ నిర్ణయం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలగింపు వెనుక ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణమేంటంటే!.. ఈమెయిల్స్ దర్యాప్తునకు సంబంధించి కాంగ్రెస్ కు సరైన సమాచారం ఇవ్వకపోవడమే అంటున్నారు.

కాగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా పదేళ్లు పదవిలో కొనసాగాల్సిన కొమెని.. ట్రంప్ నిర్ణయంతో నాలుగేళ్లకే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ తన నిర్ణయాన్ని ఓ లేఖ ద్వారా కొమెనికి తెలియజేశారు.కొమెని బ్యూరోను సమర్థవంతంగా నిర్వహించడం లేదని అమెరికా అటార్నీ జనరల్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

లాస్ ఏంజిల్స్ లో ఎఫ్‌బీఐ సమావేశం జరుగుతున్న సమయంలో కొమెనికి ఈ సమాచారం అందింది. తొలుత ఈ వార్తను అబద్దమనుకునప్పటికీ.. తొలగింపు చర్యలు నిజమేనని తేలడంతో.. పదవిని వీడడానికి కొమెని సిద్దపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+