Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ వివాదాస్పదం: ఆ సంగతి మరిచిపోయారు, భార్య గుర్తుచేస్తే కానీ!..

గీతాలపన సమయంలో సాంప్రదాయబద్దంగా తమ కుడిచేతిని హృదయంపై ఉంచడం అమెరికన్లకు అలవాటు.

వాషింగ్టన్‌: వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా నిర్లక్ష్య వైఖరితో వార్తల్లోకి ఎక్కారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఈస్టర్‌ ఎగ్‌ రోల్‌ నిర్వహించిన వేళ భార్య మెలానియా గుర్తు చేస్తే తప్ప ట్రంప్ తన నిర్లక్ష్యాన్ని గుర్తించలేదు.

ఇంతకీ విషయమేంటంటే.. సోమవారం నాడు వైట్ హౌజ్ లో సంప్రదాయ ఈస్టర్‌ ఎగ్‌ రోల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానించిన ట్రంప్ దంపతులు.. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే గీతాలపన సమయంలో సాంప్రదాయబద్దంగా తమ కుడిచేతిని హృదయంపై ఉంచడం అమెరికన్లకు అలవాటు. అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని మరిచిపోయిన వేళ, పక్కనే ఉన్న ఆయన భార్య మెలానియా చేతితో తట్టి గుర్తుచేశారు.

Trump forgets to put hand on heart for National Anthem

ఆ వెంటనే విషయం అర్థమైన ట్రంప్.. కుడిచేతిని హృదయంపై ఉంచి జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, దేశాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి జాతీయ గీతాన్ని గౌరవించాలన్న కనీస నిబంధన తెలియదా అని అక్కడివారు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+