US Election 2024:సందడి చేస్తున్న ఒపీనియన్ పోల్స్..గెలుపు ఎవరిదంటే..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉండగా... డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారాన్ని ఇరు అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒపీనియన్ పోల్స్ సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఒపీనియన్ పోల్స్ ఎవరు గెలుస్తారని జోస్యం చెబుతున్నాయి..?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్ సందడి చేస్తున్నాయి.బెట్టింగ్ మార్కెట్స్ ట్రంప్ అధికారం చేపడతారని కోడై కూస్తున్నాయి. పాలీ మార్కెట్ అనే సంస్థ వెలువడించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్‌నే వరిస్తుందని పేర్కొంది. జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నప్పటి నుంచి ట్రంప్‌కు కలిసొచ్చిందని వివరించాయి. ట్రంప్‌కు అధ్యక్షుడయ్యే అవకాశాలు 60శాతం మేరా మెరుగయ్యాయని పేర్కొంది.ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి 100 ఓట్లలో 60 ఓట్లు ట్రంప్‌కే వస్తాయని ఒపీనియన్ పోల్స్ జోస్యం చెప్పాయి.

ట్రంప్ విజం సాధిస్తారని పలు మార్కెట్లు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు బెట్‌ఫెయిర్ అనే సంస్థ ట్రంప్ గెలుపు అవకాశాలు 58శాతం ఉన్నాయని అంచనా వేస్తుండగా.. కల్షి పెగ్స్ 57శాతం,ప్రెడిక్టిక్ 54శాతం స్మార్కెట్స్ 58శాతం అంచనా వేశాయి.జూలై నెలలో 48శాతంగా గెలుపు అవకాశాలు ట్రంప్‌కు ఉండగా... సెప్టెంబర్ చివరికి 57శాతానికి ఎగబాకింది.
ఇదిలా ఉంటే పోలింగ్ డేటా ఫైవ్ థర్టీ ఎయిట్ మాత్రం మరోలా జోస్యం చెప్పింది. ఈ సంస్థ ప్రకారం కమలా హారిస్ స్వల్ప తేడాతో అధికారం చేపట్టే అవకాశాలున్నాయని పేర్కొంది. కమలా హారిస్ విన్నింగ్ ఛాన్సెస్ 48-49శాతం ఉండగా... ట్రంప్‌కు 46-47శాతంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే ఏడు రాష్ట్రాల్లోనే అసలు సిసలైన పోరు కనిపిస్తోంది. ఇక్కడే ట్రంప్ కాస్త ముందంజలో ఉండే అవకాశం ఉంది.
ఇక ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన వ్యాపారాలకు సంబంధించిన స్టాక్స్ ఒక్కసారిగా రయ్ మని దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌లకు చెందిన షేర్లు అక్టోబర్‌లో 86శాతం మేరా పెరిగాయి. ట్రంప్ గెలుస్తాడన్న ధీమా ఉండటంతోనే స్టాక్స్ రేట్ పెరుగుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ట్రంప్ అధికారంలోకి వస్తారన్న వార్తలు ప్రచారంలో ఉండటంతో బ్యాంకింగ్, క్రిప్టో కరెన్సీ షేర్లు కూడా మార్కెట్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాయి.












Click it and Unblock the Notifications