• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డెమొక్రాట్లపై మండిపడుతున్న ట్రంప్, ఏంటీ గవర్నమెంట్ షట్‌డౌన్!? ఇప్పుడిక ఏం జరుగుతుంది?

By Ramesh Babu
|

వాషింగ్టన్: అమెరికాలో గవర్నమెంట్ షట్‌డౌన్ అయింది. అదే.. ట్రంప్ ప్రభుత్వం స్తంభించిపోయింది. కారణం- ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడమే. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవులు ప్రకటించారు.

అమెరికాలో ప్రభుత్వ నిర్వహణ, ఖర్చులకు సంబంధించి నిధుల వినియోగంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వం షట్‌డౌన్‌ అయింది. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు నిలిచిపోయాయి. అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి కారకులెవరు? ఇప్పుడిక ఏం జరుగుతుంది?

అసలెందుకీ పరిస్థితి?

అసలెందుకీ పరిస్థితి?

ఈ ద్రవ్య వినిమయ బిల్లులో అమెరికాలోని స్వాప్నికుల(డ్రీమర్స్‌) భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని డెమోక్రాట్లు వ్యతిరేకించారు. వీరికి కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతిచ్చారు. తాజా ద్రవ్య వినిమయ బిల్లులో ట్రంప్‌ స్వాప్నికుల భద్రతను పక్కన పెట్టడంతో డెమోక్రాట్లు ఆగ్రహించారు. దీంతో ఈ బిల్లు ఆమోదానికి డెమొక్రాట్లు తమ మద్దతు తెలుపలేదు. దీంతో నిధుల లేమితో అమెరికాలో ప్రభుత్వ విభాగాలు స్తంభించిపోయాయి. 1981 నుంచి ఇంతవరకూ అమెరికాలో 12 సార్లు ‘గవర్నమెంట్‌ షట్‌డౌన్‌' పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బిల్‌ క్లింటన్‌ హయాంలో అత్యధికంగా 1995 డిసెంబర్‌ నుంచి 1996 జనవరి వరకూ 21 రోజులు షట్‌డౌన్‌ కొనసాగింది. ప్రస్తుత షట్‌ డౌన్‌ పిబ్రవరి 16 వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎవరీ డ్రీమర్స్...

ఎవరీ డ్రీమర్స్...

సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారి పిల్లలే డ్రీమర్లు(స్వాప్నికులు). వీరికి తాత్కాలికంగా అమెరికాలో ఉండే హక్కు ఇచ్చారు. వీరు ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒబామా హయాంలో చట్టబద్ధంగా వీరికి ఈ అవకాశం కల్పించారు. అయితే ట్రంప్‌ దీన్ని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలా చేస్తే దాదాపు 8 లక్షల మంది స్వాప్నికుల భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. ఒక ఆరు నెలల మాత్రమే గడువు ఇచ్చిన ట్రంప్‌ సర్కార్‌ గడువు దాటిని తర్వాత కూడా అక్కడే ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అరెస్టు చేస్తోంది. వారిని బలవంతంగా దేశం నుంచి పంపించి వేస్తున్నారు.

ఇప్పుడిక ఏం జరుగుతుంది?

ఇప్పుడిక ఏం జరుగుతుంది?

అమెరికాలో ప్రభుత్వం మూతపడటంతో లక్షలాది మంది ఉద్యోగులు వేతనం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. రక్షణ విభాగంలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడుతుంది. అత్యవసర సేవల్లో పనిచేసే 1.5 మిలియన్‌ మిలిటరీ సిబ్బంది, 40 వేల మంది హోంల్యాండ్‌ భద్రత సిబ్బంది మాత్రం యథావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీరు కాకుండా పెంటగాన్‌లోని సుమారు 7,40,000 మంది ఉద్యోగులు తమ ఇళ్లకే పరిమితం అవుతారు.

ఏయే విభాగాలు పనిచేస్తాయంటే...

ఏయే విభాగాలు పనిచేస్తాయంటే...

అధ్యక్ష నివాసం వైట్‌హస్‌, కాంగ్రెస్‌, ఫెడరల్‌ కోర్టులు, వెటరన్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు యథావిధిగా నడుస్తాయి. యూఎస్‌ పోస్టల్‌ సర్వీసు కూడా నడుస్తుంది. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సాధారణంగా పనిచేస్తుంది. విమానాశ్రయాలు ప్రయాణికుల కోసం తెరిచే ఉంటాయి. పాఠశాలలు, ప్రజారవాణా విభాగాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. వైద్య విభాగంలో అత్యవసర సేవలు నడుస్తాయి.

రాజధాని వాషింగ్టన్‌పై తీవ్ర ప్రభావం...

రాజధాని వాషింగ్టన్‌పై తీవ్ర ప్రభావం...

ఫెడరల్ బడ్జెట్‌పై ఆధారపడే అమెరికా రాజధాని వాషింగ్టన్‌పై షట్‌డౌన్‌ ప్రభావం పడనుంది. చెత్త నిర్వహణ, వీధుల శుభ్రతకు సంబంధించిన సేవలు నిలిచిపోతాయి. గ్రంథాలయాలు మూతపడతాయి. వ్యాధి నియంత్రణ కేంద్రాలకు సంబంధించిన ఉద్యోగుల్లో 61శాతం మంది విధులకు హాజరుకారు. పరిశోధనకు సంబంధించిన నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్స్‌ మూతడపతాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు బదులు...

ప్రభుత్వ ఉద్యోగులకు బదులు...

రెవెన్యూ సేవలు, సోషల్‌ సెక్యురిటీ అడ్మినిస్ట్రేషన్‌, గృహ పట్టణాభివృద్ధి విభాగాలు, విద్య, వాణిజ్య, కార్మిక, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విభాగాలు మూతపడతాయి. తాత్కాలిక ప్రణాళికల ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో జాతీయ పార్కులు, మ్యూజియంలు తెరిచి ఉంచే అవకాశం ఉంది. అయితే అందులోని ప్రభుత్వ ఉద్యోగులకు బదులుగా ప్రైవేటు కాంట్రాక్టర్లతో నడిపించే అవకాశం ఉంటుంది.

డెమొక్రాట్లపై మండిపడుతున్న ట్రంప్...

డెమొక్రాట్లపై మండిపడుతున్న ట్రంప్...

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదముద్ర వేయడంలో కలిసిరాకుండా అమెరికాలో ప్రభుత్వం స్తంభించిపోవడానికి కారణమైన డెమొక్రాట్లపై అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. డెమొక్రాట్ల తీరుపై ట్విట్టర్‌లో ఆయన ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. ‘‘నేను అధ్యక్షుడిగా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా డెమొక్రాట్లు నాకో మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నట్లున్నారు.. అసలు షట్‌డౌన్ అవాల్సింది ప్రభుత్వం కాదు.. డెమొక్రాట్లు..'' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, అధ్యక్షుడిగా ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్లోరిడాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్న ట్రంప్ చివరికి తన ట్రిప్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.

English summary
Donald Trump has blamed Democrats for the failure of budget talks that have forced the US government to shut down. On the anniversary of Donald Trump's inauguration as US President, hundreds of thousands of federal workers face going without pay and many have been told not to turn up for work. In a dramatic night in Washington DC, Republican leaders fell short of the 60 votes needed in the Senate to pass a spending bill. This bill would have provided a fiscal rescue package to keep funding the government until 16 February. Mr Trump tweeted: "This is the One Year Anniversary of my Presidency and the Democrats wanted to give me a nice present. #DemocratShutdown." He was forced to cancel his weekend trip to Florida where he was planning to celebrate his year as president at his Mar-a-Lago resort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X