వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియాకు అంత సీన్ లేదు: 'నైస్' అని చైనాకు ట్రంప్ చురక

చైనా, ఉత్తర కొరియాల పైన అమెరికా తదుపరి అధ్యక్షులు బరాక్ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చైనా, ఉత్తర కొరియాల పైన అమెరికా తదుపరి అధ్యక్షులు బరాక్ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖండాంతర విధ్వంసక క్షిపణి (ఐసీబీఎం)తో అమెరికా పైన దాడులు చేస్తామన్న ఉత్తర కొరియా హెచ్చరికల పైన ట్రంప్ స్పందించారు.

ఓ పక్క అణు పరీక్షలు, మరోవైపు క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియాను హెచ్చరికలు జారీ చేస్తుండగా.. ట్రంప్‌ గడ్డిపోచలా తీసి పడేశారు. అమెరికాను తాకే శక్తి గల అణ్వాయిధ ప్రయోగ క్షిపణులను తయారు చేసే సత్తా ఉత్తర కొరియాకు లేదని, ప్రజలు నిశ్చింతగా ఉండవచ్చునని ట్విట్టర్లో పేర్కొన్నారు.

అమెరికాపై ఒత్తిడికేనా?

అమెరికాపై ఒత్తిడికేనా?

అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఖండాంతర క్షిపణ తయారీ చివరి దశలో ఉందంటూ ఇటీవల ఉత్తర కొరియా నేత కిమ్‌ జంగ్‌ ఉన్‌ ప్రకటించారు. భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరించే ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకే కిమ్‌ ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.

ట్రంప్ స్పందన

ట్రంప్ స్పందన

ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ట్రంప్ స్పందించారు. ఉత్తర కొరియాపై ఇప్పటి దాకా ట్రంప్ ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. బరాక్ ఒబామా ప్రభుత్వం ఉత్తర కొరియాను న్యూక్లియర్‌ దేశంగా గుర్తించేందుకు నిరాకరించింది.

చైనా, ఉ కొరియాపై ఆగ్రహం

చైనా, ఉ కొరియాపై ఆగ్రహం

చైనా పైన కూడా స్పందించారు. పక్షపాత వాణిజ్య విధానాన్ని అనుసరిస్తూ చైనా.. అమెరికాను నిలువునా దోచుకుంటోందని, అలా డ్రాగన్ దేశం ఇప్పటికే భారీ మొత్తాన్ని, సంపదను పోగేసిందని ట్రంప్ ఆరోపించారు.

నైస్ అంటూ వ్యంగ్యం

నైస్ అంటూ వ్యంగ్యం

అమెరికా సంపదను కొల్లగొడుతున్న చైనా, ఉత్తర కొరియాకు సహాయం చేయడం లేదని చెప్పుకోవడంపై ట్రంప్ వ్యంగ్యంగా 'నైస్' అన్నారు. చైనా అండతోనే ఉత్తర కొరియా పెట్రేగుతోందన్నారు. సమగ్ర విధానాలతో ఆ రెండు దేశాలకు సమాధానం చెబుతామన్నారు.

English summary
Donald Trump says US safe from North Korean nuclear strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X