"TRUMP IS DEAD".. ? అమెరికాలో సగం ఎత్తులో జాతీయ జెండా..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన అధికారిక వైట్ హౌస్ భవనంలో కనిపించకపోవడంతో కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు చేస్తున్నారు. "TRUMP IS DEAD" అనే వార్త ప్రస్తుతం ఎక్స్ లో ట్రెండింగ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ CVI వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు దేశంలో 'టెర్రిబుల్ ట్రాజెడీ' సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై కథనాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ రూమర్స్ ను వైట్ హౌస్ తాజాగా ఖండించింది.
#Breaking
— MOHAMMAD JAFAR ABBAS محمد جعفر عباس (@MOHAMMA47949502) August 30, 2025
🇺🇲🇮🇱🔥 The newsies are coming from International media that #Trump have been passed away after 3 days no walks, no white House visit and scheduled meeting due to heavy internal pressure and #Mossad's conspiracy. #Trump is ill & suffering from cancer livercylosis pic.twitter.com/0NGcT2tYXR
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదంటూ కథనాలు వస్తున్నాయి. నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన ఒక్కసారిగా అదృశ్యం కావడంతో సామాజిక మాధ్యమాల్లో "TRUMP IS DEAD" అనే వార్త చక్కర్లు కొడుతోంది. ట్రంప్ కు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అంతేకాక ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కథనాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. జేడీ వాన్స్ మట్లాడుతూ.. అవసరమైతే అధ్యక్ష పదవిని చేపడతానని ప్రకటించారు. ఇక ప్రస్తుతం ట్రంప్ కు 79 ఏళ్లు కాగా.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల ట్రంప్ చేతిపై గాయం కూడా కనిపించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే భారత్ వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించారు. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే భారత్ పై అమెరికా సుంకాలు విధించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చైనాలో జరగనున్న SCO సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో అమెరికా వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించనున్నాయి. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. ఈ సమావేశం కోసం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన చేపట్టారు.












Click it and Unblock the Notifications