వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువులపై ట్రంప్ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొలాల్డ్ ట్రంప్ ప్రవాస భారతీయులు (హిందువులు)తో భేటీ కాబోతున్నారు. ఆదివారం న్యూజేర్సీలో నిర్వహిస్తున్న రిపబ్లిక్ హిందూ కొయలిషన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించనున్నారు.

ఈ విషయంపై రిపబ్లిక్ హిందూ కొయలిషన్ పదాధికారులు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం వల్ల బాధితులైన హిందూవులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడనున్నారని చెప్పారు. అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి హిందువులను ఉద్దేశించి మాట్లాడటం ఇదే మొదటి సారి అన్నారు.

హిందువులు, భారతీయులతో స్నేహం చెయ్యడానికి ట్రంప్ ఉత్సాహంగా ఉన్నారని రిపబ్లిక్ హిందూ కొయలిషన్ పదాధికారులు చెప్పారు. ఈ సమావేశం వల్ల కాశ్మీర్, హిందూ శరణార్థులకు ప్రయోజనం కలుగుందని అన్నారు.

Trump

ఇటీవల విడుదల చేసిన వీడియోలో ట్రంప్ మాట్లాడుతూ తాను రిపబ్లిక్ హిందు కొయలిషన్ (ఆర్ హెచ్ సీ) కార్యక్రమానికి హాజరవుతున్నానని స్పష్టం చేశారు. హిందూ సమాజం అమెరికా సంసృతికి, ప్రంపచ నాగరికతకు ఎనలేని సేవలందించిందని ట్రంప్ అన్నారు.

కుటుంబ విలువలను భారతీయులను చూసి నేర్చుకోవాలని ట్రంప్ చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరౌతున్నందుకు చాల సంతోషంగా ఉందని ట్రంప్ వివరించారు. హిందువులు అందరూ తనకే ఓటు వేస్తారని ట్రంప్ ఆశతో ఉన్నారు.

English summary
The Republican Hindu Coalition (RHC)'s Humanity United Against Terror event on 15 October in New Jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X