మోడీ మరో పెళ్లి చేసుకుంటే నేనే పెళ్లిళ్ల పేరయ్యనవుతా!: ట్రంప్ వింత వ్యాఖ్యలు
Recommended Video

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ వివాహం విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మోడీజీ మరో పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తానంటూ వ్యాఖ్యానించారు. వినడానికే కాస్తా వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నా ఈ విషయం మాత్రం నిజమేనని అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో.
నరేంద్ర మోడీకి చిన్నతనంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినట్లు తెలుస్తోంది.

మోడీ పెళ్లి కోసం నేనే పెళ్లిళ్ల పేరయ్య..
గత సంవత్సరం భారత్ - అమెరికా అధ్యక్షుల సమావేశం సందర్భంగా ట్రంప్.. ‘ఆయన(మోడీ) ఒప్పుకుంటే నేను ఆయన కోసం పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతాను' అంటూ సరదాగా వ్యాఖ్యానించారట.. ఈ విషయాలన్నింటిని ‘పొలిటికో' వెలువరించింది.

ట్రంప్ వింత చేష్టలు
ట్రంప్ విదేశీ నేతల సమావేశాల సందర్భంగా మర్చిపోయిన మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు - తప్పిదాలు' పేరటి పొలిటికో ఓ కథనాన్ని వెలువరించింది. దీనిలో విదేశీ నేతలతో సమావేశం సందర్భగా ట్రంప్ వింతగా ప్రవర్తించిన సన్నివేశాలను, టెలిఫోన్ మర్యాదలు మర్చిపోయిన సందర్భాలను, ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్చరించిన సందర్భాల గురించి తెలియజేసింది.

ఇండియాలోనే నేపాల్, భూటాన్ అనుకున్నారట
అంతేగాక, ఈ కథనంలో ట్రంప్‌కు దక్షిణాసియా దేశాల గురించి ఎటువంటి వివరాలు తెలియవని పొలిటొకో పేర్కోంది. గత సంవత్సరం భారత్ సమావేశం సందర్భంగా ట్రంప్.. దక్షిణాసియా మ్యాప్‌ను తొలిసారిగా పరిశీలించారంట. ఆ సందర్భంగా ఆయన నేపాల్, భూటన్ వంటి దేశాల పేర్లను ‘నిపుల్', ‘బుట్టోన్'గా పలికాడని పొలిటికో వెల్లడించింది. కాగా, ట్రంప్ ఈ దేశాలన్నింటిని ఇండియాలో భాగమేనని అనుకున్నారంటా.

మోడీ కోసం నేనే సంబంధం చూస్తా..
ఆ సమావేశం సందర్భలోనే మోడీ గురించి ప్రస్తావన రాగా ప్రస్తుతం మోడీ తన భార్యతో కలిసి ఉండటం లేదు. అందువల్ల ఈ సమావేశానికి ఆయన ఒంటరిగా వస్తున్నారని వైట్ హౌస్ అధికారులు తెలిపారంట. అందుకు ట్రంప్ ‘అలా అయితే మోడీ కోసం నేను సంబంధం చూస్తాను' అని జోక్ చేశారంట. ఈ విషయాలను ఓ ఇద్దరులు అధికారులు తమకు తెలిపారంటూ పొలిటికో తన కథనంలో పేర్కొంది.












Click it and Unblock the Notifications