ట్రంప్‌ను మించి!: రన్నింగ్ బాడీగార్డ్స్ నుంచి.. కిమ్ భద్రతా వలయం, నోరు వెళ్లబెట్టాల్సిందే

సింగపూర్: సింగపూర్‌లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌లు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కిమ్ హాజరైన తీరు చూసి భద్రతా నిపుణులే ఆశ్చర్యపోయారు. అమెరికా అధ్యక్షుడి రక్షణకు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో కిమ్‌ రక్షణకు కూడా ఉత్తర కొరియా ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది.

కిమ్‌ ఎప్పుడు బయల్దేరేది ఎవరికీ ముందుగా తెలియదు. కేవలం సింగపూర్‌లోని కొన్ని ప్రభుత్వ వర్గాలకు మాత్రమే ఈ సమాచారం అందింది. ఆయన వ్యక్తిగత జెట్‌ గోస్‌హ్యాక్‌ 1(ఇల్యూషన్‌ 62) విమానంతో మరో రెండు విమానాలు ప్యాంగ్‌ యాంగ్‌ నుంచి బయల్దేరాయి. అంతా కిమ్‌ వీటిలో బయల్దేరారని భావించారు.

ఆకాశంలోనే దారి మార్చుకున్న విమానం

ఆకాశంలోనే దారి మార్చుకున్న విమానం

కానీ, కిమ్‌ ఎయిర్‌ చైనాకు చెందిన బోయింగ్‌ 747లో సింగపూర్‌ వచ్చారు. ఈ విమానంలో ప్యోంగ్‌యాంగ్‌ నుంచి బీజింగ్‌ సర్వీసును నిర్వహిస్తుంటుంది. కానీ, ఆకాశంలోనే దారి మార్చుకొని సింగపూర్‌ విమానాశ్రయంలో దిగింది. దీనికి ఫైటర్ జెట్‌ విమానాలు రక్షణగా వచ్చాయి.

కిమ్ కాన్వాయ్

కిమ్ కాన్వాయ్

కిమ్ దాదాపు 20 కార్ల కాన్వాయ్‌ను తన వెంట తీసుకొచ్చారు. నలుపు రంగు బెంజి కార్లు ఉన్న కాన్వాయ్‌లో కొన్ని లిమోసిన్‌లు కూడా ఉన్నాయి. కిమ్‌ వీటిలోనే ప్రయాణించారు. కాన్వాయ్‌ను అంటిపెట్టుకొని ఒక అంబులెన్స్‌ కూడా అనుసరించింది.

కిమ్ రక్షణ కోసం రన్నింగ్ బాడీ గార్డ్స్

కిమ్ రక్షణ కోసం రన్నింగ్ బాడీ గార్డ్స్

కిమ్‌ సింగపూర్‌ పర్యటనలో రన్నింగ్‌ బాడీ గార్డ్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో కూడా దక్షిణ కొరియాతో చర్చల సందర్భంగా వీరు కిమ్‌ను కంటికి రెప్పలా కాపాడారు. నల్లరంగు సూటు ధరించిన డజను మంది భద్రతా సిబ్బంది నల్ల రంగు అద్దాలు ఉన్న లిమోసిన్‌ కారు పక్కన పరుగులు తీస్తూ వస్తున్న దృశ్యాన్ని సింగపూర్‌‌వాసులు ఆశ్చర్యంతో చూశారు. సింగపూర్‌లో నల్లరంగు అద్దాల కార్లకు అనుమతి లేదు. చివరి ఆ దేశ ప్రధాని కారుకు కూడా నల్లరంగు అద్దాలు ఉండవు. కిమ్‌ భద్రతా సిబ్బంది మొత్తం సమానమైన ఎత్తులో ఉంటారు. వీరు కిమ్‌ ప్రయాణించే వాహనానికి మానవ కవచంలా ఏర్పడి రక్షణ కల్పిస్తుంటారు.

మూడంచెల భద్రత

మూడంచెల భద్రత

దీనికి తోడు కిమ్‌ ఎప్పుడూ మూడంచెల భద్రతా వలయంలో ఉంటారు. సింగపూర్‌లో దిగిన రెండు గంటల తర్వాత కూడా కిమ్‌ చిత్రాలు బయటకు రాలేదు. కిమ్‌ చిత్రాలు బయటకు రావాలంటే ఉత్తర కొరియా అధికారిక ఫొటోగ్రాఫర్‌ తీయాల్సిందే. భద్రతా సిబ్బంది ఎంపికలో కూడా ఉత్తర కొరియా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ నుంచి వీరిని ఎంపిక చేస్తారు. దేశాధినేత కోసం వీరు ఏం చేసేందుకైనా వెనుకాడరు. వీరంతా కచ్చితంగా కిమ్‌కు సమానమైన ఎత్తులో ఉంటారు. వీరిని ది ఆఫీస్‌ ఆఫ్‌ ఎజిటెంట్స్‌ అని పిలుస్తుంటారు. కిమ్ ఇంటి వద్ద రక్షణ కూడా వీరిదే.

ట్రంప్‌ను మించిన భద్రత

ట్రంప్‌ను మించిన భద్రత

కిమ్ భద్రతా వలయం ఓ విధంగా ట్రంప్‌ను మించి ఉంది! కిమ్ పర్యటన నేపథ్యంలో సింగపూర్‌కు ప్యోంగ్‌యాంగ్ నుంచి మూడు విమానాలు వచ్చాయి. రెండిట్లో కిమ్ రక్షణ, సహాయ సిబ్బంది ఉన్నారు. కిమ్ వ్యక్తిగత వైద్యుడు, వైద్య బృందం ఆయన వెంటే ఉంటుంది. కిమ్‌కు అవసరమైన మద్యం, ఆహారం, నీరు, మద్యం అన్ని ఉత్తర కొరియా నుంచి తెచ్చారు. కిమ్ ఉపయోగించే ఫోన్లను రహస్యంగా ఉంచే ఓ టెక్నికల్ బృందం కూడా సింగపూర్ వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+