ఉక్రెయిన్- రష్యా మధ్య డీల్ కుదిరింది.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్- రష్యా మధ్య గత నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఇరు దేశాల మధ్య సంధి కుదుర్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబర్ 5న అమెరికా నుంచి వచ్చిన దౌత్య వేత్తలు స్టీవ్ విట్ కాఫ్, జార్డ్ కుష్నర్ రష్యా యంత్రాంగంతో చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 6 న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సంప్రదింపులు జరిపారు. అనంతరం సెప్టెంబర్ 8న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య ఫోన్ సంభాషణ కూడా జరిగింది. సుమారు గంటపాటు ఇరు దేశాధినేతలు యుద్ధంతోపాటు పలు అంశాలపై చర్చించారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

రష్యాలోని చమురు రిఫైనరీలపై దాడులను ఆపేందుకు ఉక్రెయిన్ అంగీకరించిందని అన్నారు. అలాగే రష్యా కూడా ఉక్రెయిన్ లోని ఎనర్జీ మౌలిక సదుపాయాలపై దాడులు చేయనని స్పష్టం చేసిందని అన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ రేట్లు భారీగా పెరిగాయని అన్నారు. అలాగే ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇరాన్- అమెరికా యుద్ధం కాదని రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పకనే చెప్పారు ట్రంప్. మరోవైపు ఇటీవల ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడుతూ.. యుద్ధంలో ఇరాన్ ఓడిపోతేనే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ ట్రంప్ కామెంట్స్ పై అటు రష్యా కానీ.. ఇటు ఉక్రెయిన్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Trump latest deal has been reached between Ukraine and Russia US President Trump makes key remarks

" రష్యాలోని ఎనర్జీ స్థావరాలపై దాడి చేయమని ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యా కూడా ఉక్రెయిన్ లోని ఎనర్జీ స్థావరాల జోలికి పోమని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డీజిల్ రేట్లు పెరగడానికి గల కారణం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రమే.. కానీ ఇరాన్- అమెరికా యుద్ధం కాదు" అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని అన్నారు. తాము అమెరికా కంటే ఇతర దేశాల ప్రయోజనాల కోసమే శ్రమిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+