రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ అమల్లోకి: ట్రంప్ కీలక ప్రకటన
రష్యా- ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య సంధి కుదుర్చేందుకు అమెరికా గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని తెలిపారు.
ఈ మేరకు ఇంధన మౌలిక సదుపాయాల వద్ద కాల్పుల విరమణకు రష్యా- ఉక్రెయిన్ ఇరు దేశాలు అంగీకారం తెలిపాయని దాంతో ఈ ఎనర్జీ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు చేశారు. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులతో అమెరికాలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఇటీవల ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు ట్రంప్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాక రష్యాతో డీల్ కుదుర్చుకోగలిగే కొత్త నాయకుడిని ఉక్రెయిన్ ప్రజలు ఎన్నుకోవాలని కూడా సూచించారు. అయితే ఇప్పుడు ఎనర్జీ సీజ్ ఫైర్ కు రష్యా- ఉక్రెయిన్ అంగీకరించాయని ట్రంప్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

ఇక ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న ఎనర్జీ మౌలిక సదుపాయాలపై దాడులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య విద్యుత్ గ్రిడ్ లు, పవర్ ప్లాంట్లపై దాడులు ఆగిపోనున్నాయి. నిన్నమొన్నటి వరకు ఉక్రెయిన్ లోని పవర్ ప్లాంట్ లపై రష్యా దాడులు కొనసాగించింది. అలాగే రష్యా ఇంధన మౌలిక వసతులపై ఉక్రెయిన్ దాడులను వేగవంతం చేసింది. ఇరు దేశాల మధ్య ఇలాంటి దాడుల కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత ఏర్పడుతోంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ కు ట్రంప్ పట్టుబట్టారు. ఎట్టకేలకు ట్రంప్ నిర్ణయాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి. దాంతో రష్యా- ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ తక్షణమే అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications
