ఇండియన్స్‌కు ట్రంప్ షాక్: అదే జరిగితే.. 7500మంది రోడ్డున పడ్డట్లే!..
చిన్నతనంలోనే అమెరికాకు అక్రమంగా వలస వచ్చి.. అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారికి వర్క్ పర్మిట్ ఇచ్చేలా ఒబామా సర్కార్ గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
వాషింగ్టన్: ఇప్పటికే వీసా నిబంధనలు, ప్రీమియం వీసాల రద్దు నిర్ణయంతో భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్ మరో షాక్ ఇవ్వబోతున్నారు. 'డిఫర్డ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ అరైవల్' అనే పథకాన్ని రద్దు చేయడం ద్వారా 7500మంది భారతీయులను జాబ్స్ నుంచి తప్పించాలని యోచిస్తున్నారు.
చిన్నతనంలోనే అమెరికాకు అక్రమంగా వలస వచ్చి.. అక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారికి వర్క్ పర్మిట్ ఇచ్చేలా ఒబామా సర్కార్ గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అమెరికాలో దాదాపు 7 లక్షల 50 వేల మంది విదేశీయులు ఉపాధి పొందగా.. అందులో భారతీయులు 7500మంది ఉన్నారు.

'డిఫర్డ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ అరైవల్' గనుక ట్రంప్ రద్దు చేస్తే.. ఉన్నపలంగా 7500మంది భారతీయులు రోడ్డుపై పడటం ఖాయం. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో అక్కడి ఐటీ కంపెనీలన్నీ స్థానికతకే పెద్ద పీట వేస్తున్నాయి. వేతన సడలింపుల్లో భాగంగా.. అత్యధిక వేతనం ఉన్నవారినే విదేశాల్లో రిక్రూట్ చేసుకోవాలని అమెరికా గతంలో ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. అమెరికా నిర్ణయించిన దానికన్నా తక్కువ వేతనంతో పనిచేస్తున్న భారతీయులంతా ఇంటి ముఖం పట్టారు.తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మరికొంతమంది భారతీయులు దేశం వీడక తప్పేలా లేదు. అయితే ఈ నిర్ణయం కార్యరూపం దాల్చేసరికి మార్పులు జరగవచ్చునని వైట్ హౌజ్ అధికార ప్రతినిధి పాల్ రియాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.












Click it and Unblock the Notifications