కిమ్‌కు ట్రంప్ షాక్: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న జాబితాలో ఉ.కొరియా, ఆంక్షలు?

Recommended Video

    Donald Trump on North Korea ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న ఉ.కొరియా | Oneindia Telugu

    వాషింగ్టన్: ఉత్తరకొరియాకు మరోసారి అమెరికా షాకిచ్చింది. గతంలో అణు పరీక్షలు, క్షిపణీ పరీక్షలు నిర్వహించిన సమయంలో ఉత్తరకొరియాపై వాణిజ్య పరమైన ఆంక్షలను విధించింది. ఉత్తరకొరియా తీరు మార్చుకోకపోవడంతో ఐక్యరాజ్యసమితి ఈ మేరకు గతంలో నిర్ణయం తీసుకొంది. ఇదే తరహలో తాజాగా ఉత్తరకొరియాకు అమెరికా షాకిచ్చింది. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా నార్త్ కొరియా పేరును అమెరికా ప్రకటించింది.

    ఉత్తరకొరియా ఇటీవల కాలంలో వ్యవహరించిన తీరుతో ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. అయితే అమెరికా హెచ్చరికలను కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ లెక్క చేయలేదు. ఈ తరుణంలో ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించారు.

    అమెరికా సవాళ్ళకు ఉత్తరకొరియా కూడ ధీటుగా సమాధానాలు ఇచ్చింది. అణు పరీక్షలతో అగ్ర రాజ్యానికి వణుకు పుట్టించింది. తాము తలుచుకొంటే అమెరికాను క్షణంలో చీకట్లో ముంచెత్తుతామని హెచ్చరికలు జారీ చేసింది.

    ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాల్లో ఉ. కొరియా

    ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాల్లో ఉ. కొరియా

    ఉత్తర కొరియాకు అమెరికా మరోమారు షాకిచ్చింది. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియా పేరును అమెరికా ప్రకటించింది. ఇప్పటికే ఆ దేశంపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో మరోమారు అగ్గి రాజేశారు. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా గడ్డపై నుండి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్.

    మరిన్ని ఆంక్షలు విధించేందుకేనా?

    మరిన్ని ఆంక్షలు విధించేందుకేనా?

    ఉత్తర కొరియాను నేడు ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటిస్తున్నాం. చాలా ఏళ్ల క్రితమే ఈ పని చేయాల్సిందని శ్వేతసౌధంలో సోమవారం ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న నార్త్ కొరియా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతోందని, విదేశాలను నాశనం చేయాలని చూస్తోందని ట్రంప్ ఆరోపించారు.దీంతో ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

    సోదరుడి హత్య వెనుక కిమ్ హస్తం

    సోదరుడి హత్య వెనుక కిమ్ హస్తం

    ఈ ఏడాది మలేషియా విమానాశ్రయంలో కిమ్ జోంగ్ సోదరుడు హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనక కిమ్ హస్తం ఉన్నట్టు అమెరికా ఆరోపించింది. నార్త్ కొరియా చట్టబద్ధంగా నడుచుకోవాలని, అణ్వస్త్ర పరీక్షలకు స్వస్తి చెప్పాలని, అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే చర్యలను మానుకోవాలని ట్రంప్ హెచ్చరించినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ పేర్కొన్నారు.

    కిమ్ ఎలా స్పందిస్తారో చూడాలి

    కిమ్ ఎలా స్పందిస్తారో చూడాలి

    తాజాగా అమెరికా చేసిన ప్రకటనపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఏ రకంగా స్పందిస్తారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా ఇప్పటికే పలు దఫాలుగా తమపై ఆంక్షలను విధించేలా ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తీసుకువచ్చిందని ఉత్తరకొరియా ఆరోపణలు గుప్పించింది. ఈ తరుణంలో కిమ్ కూడ ధీటుగానే స్పందించే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+