హెచ్1బీ వీసాలపై ఊరట ప్రకటన: 'ఇండియన్స్‌కు మరిన్ని అవకాశాలు'
హెచ్-1బీ వీసాల కట్టడికి కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ జారీ చేయనున్నారంటూ వచ్చిన వార్తలను భారత అమెరికన్ పారిశ్రామికవేత్త శలభ్ కుమార్ ఖండించారు.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల కట్టడికి కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ జారీ చేయనున్నారంటూ వచ్చిన వార్తలను భారత అమెరికన్ పారిశ్రామికవేత్త శలభ్ కుమార్ ఖండించారు. ట్రంప్‌కు ఆయన మద్దతుదారు.
వీసా కట్టడి ప్రణాళికేవీ అమెరికా ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. షికాగోకు చెందిన కుమార్.. రిపబ్లికన్ హిందు సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలను విరివిగా చేపడుతుంటారు. వాషింగ్టన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
హెచ్-1బీ వీసాల మీద కార్యనిర్వాహక ఉత్తర్వుపై వైట్ హౌస్‌లో కసరత్తు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు నిజం కావన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే ఐటీ ముఖ్య పాత్ర పోషించాలని, ఈ దేశానికి మరింత ఎక్కువమంది ఐటీ నిపుణులు కావాలన్నారు.

ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో తీవ్ర కొరత ఉందని, ఆ ఖాళీలను భారత ఐటీ నిపుణులతో భర్తీ చేస్తారని చెప్పారు. శాశ్వత చట్టబద్ధ నివాసులకు ఇచ్చే గ్రీన్ కార్డుల విషయంలో దేశాలవారీ కోటాను వైట్‌హౌస్ రద్దు చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల భారత ఐటీ నిపుణులకు మేలు జరుగుతుందన్నారు.
మరోవైపు, కొన్ని దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కుమార్ సమర్థించారు. ఈ నిబంధనలను పాకిస్థాన్ వంటి దేశాలకూ వర్తింప చేయాలన్నారు. ఉగ్రవాదంపై ఆ దేశం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
షాక్: స్టూడెంట్ వీసాల్లో 60 శాతం కోత: భారత్ జోరుకు ట్రంప్ బ్రేకులు.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్











Click it and Unblock the Notifications