ఎన్విడియా తదుపరి సీఈఓ అతనే.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ అయిన ఎన్విడియాలో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సంస్థ బోర్డు ప్రకటన చేసింది. అయితే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్విడియా నూతన సీఈఓగా ఆపిల్ మాజీ చీఫ్ టిమ్ కుక్ బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ సూచనలు చేశారు. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ అద్భుతమైన పనితనాన్ని చూపించారని.. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కేవలం టిమ్ కుక్ కు మాత్రమే సాధ్యం అని స్పష్టం చేశారు.
" ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన స్థానంలోకి వచ్చే అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్కరే ఉన్నారు. ఆయనే ఆపిల్ కు చెందిన టిమ్ కుక్. ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ వస్తారు..!అని ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ మాధ్యమంలో పేర్కొన్నారు. జెన్సన్ హువాంగ్ ఆకస్మికంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా కొలెట్ క్రెస్ వ్యవహరిస్తున్నారు.

ఇక జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధాలపై దుమారం రేగిన వేళ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. చైనా గూఢచారిగా ప్రచారం జరిగిన అలిస్ హువాంగ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ అంగీకరించారు. ఈ మేరకు హువాంగ్ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. అలాగే ఆ సంస్థ ఉద్యోగినితోనూ సంబంధం సాగించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు అలిస్ హువాంగ్ చైనా గూఢచారి అనే విషయం తనకు తెలియదన్న హువాంగ్ సమాధానాన్ని తాను విశ్వసిస్తున్నట్లు ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
