వేదికపైనే కోటు విప్పేసిన ట్రంప్, ఎందుకంటే?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకొంది. వేదికపై ప్రసంగిస్తూనే ట్రంప్ తన కోటును విప్పేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
టోక్యో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకొంది. వేదికపై ప్రసంగిస్తూనే ట్రంప్ తన కోటును విప్పేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్నారు. జపాన్‌లోని యోకొటా ఎయిర్‌బేస్‌లో అమెరికా, జపాన్ దళాలను ఉద్దేశించి ట్రంప్
ప్రసంగించారు. ఈ సమయంలో ట్రంప్ చేసిన ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

వేదికపై ప్రసంగిస్తూనే తాను వేసుకున్న సూట్‌ను ట్రంప్ జాకెట్‌నువిప్పేశాడు. అంతేకాదు బాంబర్ జాకెట్‌ను వేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికాను తప్పుబట్టే హక్కు ఏ దేశానికీ లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రసంగం పూర్తయ్యాక ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఉత్తర కొరియా సమస్యను పరిష్కరించే విషయాన్ని పుతిన్‌తో చర్చించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ దక్షిణ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్,చైనాలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications