భారత్ పై ట్రంప్ ప్రశంసలు.. అంతలోనే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ను తెగ మెచ్చుకున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులు భారత దేశం నిలిపి వేస్తోందని వస్తున్న వార్తలపైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. నిజమే అయితే ఇదొక మంచి ముందడుగు అవుతుందని ఆయన భారతదేశాన్ని ప్రశంసించారు. ఇక భారత్ రష్యా నుండి చమురు కొనడం లేదని వస్తున్న వార్తల పైన ట్రంప్ స్పందించారు.
భారత్ పై ట్రంప్ ప్రశంసలు
ఇకపై భారత్ రష్యా నుండి చమురు కొనడం లేదని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అదే జరిగితే అది చాలా మంచి విషయం అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా చమురు కొనుగోళ్ల వ్యవహారంలో డోనాల్డ్ ట్రంప్ భారత్ కొనుగోళ్లను చేయబోదు అన్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ వ్యాఖ్యల తర్వాత స్పందించిన భారత్
అయితే ట్రంప్ వ్యాఖ్యల తర్వాత భారత ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపైన స్పందన వచ్చింది. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని, ధర, రవాణా, ఇతర ఆర్థిక అంశాలు ఇక్కడ కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ 85% ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని, మూడో అతిపెద్ద వినియోగదారు గా ఉన్న భారత్ అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.
భారత్ రష్యా చమురు కొనుగోళ్లలో క్లారిటీ
అందుబాటు ధరల్లో లభ్యమయ్యే చమురు కొనుగోలును కొనసాగిస్తుందని అన్నారు. దేశ ఇంధన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఉక్రెయిన్ పైన రష్యా దురాక్రమణ తర్వాత అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా భారత్ తక్కువ ధరకే రష్యా నుండి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది . అయితే ఇప్పుడు కూడా భారత రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటామని ప్రకటించింది.
భారత్ కు ట్రంప్ బెదిరింపు
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని భారతీయ ఉత్పత్తుల పైన 25% సుంకం విధించడంతో పాటు రష్యాతో ఆయుధాలు లేదా చమురు వాణిజ్యం కొనసాగిస్తే మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించడంతో, భారత రష్యాతో చమురు వాణిజ్యాన్ని కొనసాగించదని భావించారు. అయినప్పటికీ భారత్ రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతామని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications