7 నెలల జీతం ఇస్తాం.. రిజైన్ చేయండి.. ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తేనే తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరైతే ఫెడరల్ వర్కర్స్( ప్రభుత్వ ఉద్యోగులు) ప్రభుత్వం నుంచి వైదొలగాలని అనుకుంటూ ఉన్నారో .. వాళ్లకు ఓ ఆఫర్ ఇచ్చారు ట్రంప్.

ఫిబ్రవరి 6లోపు రాజీనామా చేయాలనుకునే ఉద్యోగులకు 7 నెలల జీతం అందిస్తామని ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌజ్ నుంచి మెమో వచ్చినట్లు సమాచారం. దాదాపు 20 లక్షల మందికి ఈ మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

Trump Proposes 7-Month Salary Package for Federal Workers Resigning Before February 6

స్వచ్ఛందంగా మానేస్తే..

ఎవరైనా ఉద్యోగులు ఫిబ్రవరి 6 లోపు స్వచ్ఛందంగా ఉద్యోగాలు మానేసే ఆలోచన ఉన్నవాళ్లకు ఒకేసారి 7 నెలల జీతం ఇవ్వనున్నట్లు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో దాదాపు 20 లక్షల మంది స్వచ్చందంగా ఉద్యోగాలను వదులుకోనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.9శాతం. ప్యూ రీసెర్చ్ సెంటర్‌ గణాంకాల ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్లపాటు పని చేస్తాడని తెలుస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణణం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, పాలనా విభాగం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోం అయితే..

కొవిడ్-19 తర్వాత అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం విధానానికి అలవాటుపడ్డారు. అయితే ఇప్పుడు ఈ విధానంపై ట్రంప్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఉద్యోగులంతా వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని ట్రంప్‌ అధికారిక భవనం వైట్ హౌజ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అయితే మొత్తం వర్క్ ఫోర్స్ లో దాదాపు 10-15 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆఫర్‌ను ఎంచుకుంటారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+