ట్రంప్ నన్ను బ్రూటల్ గా రేప్ చేశారు: మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేశారు. 1993 లో న్యూయార్క్ లోని ప్లాజా హోటల్ రూమ్ లో తనను బ్రూటల్ గా ఆయన అత్యాచారం చేశారని తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలోని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు బియాట్రిస్ క్యూల్ ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అయితే ఆమె ఆరోపణలను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ తీవ్రంగా ఖండించింది. డెమోక్రాట్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీకి అమెరికాలో ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఇక ఎప్‌స్టీన్ ఫైల్స్ కు సంబంధించిన అంశాల్లో అధ్యక్షుడు ట్రంప్ కు ఎలాంటి సంబంధం లేదని.. ఆయనకు క్లీన్ చిట్ లభించిందని అధ్యక్షుడి ప్రతినిధి గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక అమెరికా హౌస్ జ్యుడీషియరీ కమిటీలోని డెమోక్రాట్లు ఈ 53 పేజీల నివేదికను విడుదల చేశారు. లైంగిక నేరాలకు పాల్పడి విచారణలో ఉండి 2019 లో ఫెడరల్ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్ స్టీన్ తో ట్రంప్ కు ఉన్న పాత స్నేహంపై లోతుగా దృష్టిసారించిన డెమోక్రాట్లు.. ఈ నివేదికలో ట్రంప్ పై ఉన్న పాత లైంగిక ఆరోపణలను మరోసారి వెలికి తీసుకొచ్చారు. ఈ నివేదికలో భాగంగా మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ తో జరిపిన ఇంటర్వ్యూల వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం బియాట్రిస్ క్యూల్ 1993 లో యంగ్ స్విస్ మోడల్ గా ఉన్నారు. అలాగే ఆమె ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్ కూడా.. అయితే ఆమె 2023 నవంబర్ లో జరిగిన డొనాల్డ్ ట్రంప్ కు చెందిన అమెరికన్ డ్రీమ్ పేజెంట్ లో భాగంగా జిల్ హర్త్ రిక్రూట్ చేసుకున్నారు. 16 నుంచి 22 ఏళ్ల మధ్య యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

ఆ సమయంలో ట్రంప్ క్యూల్ వద్దకు వచ్చి ఫైనల్ గా మనం మీట్ అయ్యాం అని అన్నారు. ఆ తర్వాతి రోజు ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు ప్లాజా హోటల్ లోని పై అంతస్తుకు హోటల్ ప్రెసిడెంట్ ట్రంప్ ను మీట్ అయ్యేందుకు క్యూల్ ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం తన కెరీర్, ఎడ్యూకేషన్ కు ఉపయోగపడుతుందని భావించిన క్యూల్ పై అంతస్తుకు వెళ్లినట్లు రిపోర్టులో ఉంది. ఆ సమయంలో క్యూల్ రూమ్ లోకి వెళ్లగానే ట్రంప్ వెనుకనుంచి వచ్చి ఆమెను బ్రూటల్ గా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె డ్రెస్ ను చింపేశారు. శరీరంలో పలు చోట్ల గాయాలై రక్తం కారుతున్నా వదలకుండా కర్కశంగా ప్రవర్తించారు.. అని క్యూల్ ఆ రిపోర్టులో పేర్కొంది. తనకు వీసా ఇప్పిస్తానని, న్యూయార్క్ యూనివర్సిటీలో సీటు కూడా చూస్తానని ట్రంప్ పలు హామీలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు క్యూల్. మరోవైపు ట్రంప్ ప్రవర్తనా సరళికి క్యూల్ చేసిన ఆరోపణలు అద్దం పడుతున్నాయని డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్- ఎప్ స్టీన్ సంబంధాలపై ఇండిపెండెంట్ ప్రత్యేక న్యాయవాదిని నియమించి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
