వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంతలోనే మాట మార్చారే: రిపబ్లికన్లకు ట్రంప్ షాక్..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడెలా మాట మారుస్తారో చెప్పడం కష్టమే. ఫ్లోరిడా స్కూల్ కాల్పుల తర్వాత తుపాకులను తుపాకులతోనే ఎదుర్కోవాలని చెప్పిన ఆయన.. ఇప్పుడు మాత్రం రిపబ్లికన్లకు షాక్ ఇచ్చారు. శక్తివంతమైన గన్‌ లాబీకి మరీ ఇంత అత్యుత్సాహం పనికిరాదంటూ మాట మార్చేశారు.

నిండా క్రూరత్వమే: ఫ్లోరిడా కాల్పుల నిందితుడి మైండ్ సెట్ ఇదీ.. నిండా క్రూరత్వమే: ఫ్లోరిడా కాల్పుల నిందితుడి మైండ్ సెట్ ఇదీ..

ట్రంప్ ఏమన్నారు:

ట్రంప్ ఏమన్నారు:

ఇటీవల ఫ్లోరిడా స్కూల్లో కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ తుపాకులపై నిషేధం విధించకపోగా.. టీచర్లు కూడా గన్స్‌తో స్కూళ్లకు రావాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా గన్ ట్రైనింగ్ తీసుకునే టీచర్లకు బోనస్ కూడా ఉంటుందని ప్రకటించారు.

ఇప్పుడేమో ఇలా..:

ఇప్పుడేమో ఇలా..:


కానీ ఇంతలోనే ట్రంప్ మాటలో తేడా కనిపిస్తుండటం గమనార్హం. గన్ లాబీకి అత్యుత్సాహం వద్దని చెబుతూ.. వాటి నియంత్రణకు కొన్ని సూచనలు చేశారు. తుపాకుల నియంత్రణపై వైట్ హౌజ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన చట్టసభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.

సంస్కరణల బిల్లు..:

సంస్కరణల బిల్లు..:

తుపాకులపై నియంత్రణకు సంబంధించి ఒక బలమైన బిల్లుతో ముందుకు రావాలని ట్రంప్ సభ్యులకు సూచించారు. ఎవరైనా వ్యక్తికి తుపాకి విక్రయించేటప్పుడు.. అతని బ్యాక్ గ్రౌండ్ గురించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. అలాగే తుపాకుల కొనుగోళ్ల వయస్సును 18 నుంచి 21 పెంచాలని సూచించారు.

అలా చేస్తే బెటర్..:

అలా చేస్తే బెటర్..:

సాధారణ ప్రజల కంటే ఎన్‌ఆర్‌ఏ (నేషనల్‌ రైఫిల్‌ ఆసోసియేషన్‌) శక్తివంతమైనదని, కానీ తన విషయంలో మాత్రం అదంత శక్తివంతమైనదేమి కాదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇక అనుమానాస్పద వ్యక్తులు, మెంటల్ పేషెంట్స్ నుంచి గన్స్ స్వాధీనం చేసుకునేందుకు.. కోర్టు జోక్యం లేకుండా చేసే వెసులుబాటు ఉంటే బాగుంటుందన్నారు. ఇందుకోసం పోలీసులకే నేరుగా అధికారాలు ఉండేలా సంస్కరణలు రావాలన్నారు.

English summary
“You’re scared of the NRA,” President Donald Trump declared in a room of lawmakers Wednesday during a meeting on guns that pushed Republican priorities to the sidelines and had Democrats in the room cheering.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X