పదేళ్లలో ఆ యువతితో డేటింగ్ చేస్తా: ట్రంప్, భార్య అండ

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు మానడం లేదు. ఆయన మాటలు ఏమో గానీ, గతంలో ఆయన చేసిన వీడియోలు కూడా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అందులో ఓ వీడియో తాజాగా వెలుగు చూసింది.

1992 నాటి వీడియో ఒకటి బయటపడి వైరల్ అవుతోంది. అప్పట్లో ఓ యువతిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడాడు. తాను మరో పదేళఅలలో ఆమెతో డేటింగ్ చేస్తానని చెప్పాడు. 1992లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యువతిని అక్కడున్న రియాల్టీ టీవీ స్టార్ ఎస్కలేటర్ ఎక్కుతున్నావా అని అడిగాడు. ఆమె అవునని చెబుతుంది. అప్పుడు ట్రంప్ కెమెరా వైపు తిరిగి మరో పదేళ్లలో ఆమెతో నేను డేటింగ్ చేస్తానని చెప్పాడు.

donald trump

ట్రంప్‌కు సతీమణి అండ

డొనాల్డ్‌ ట్రంప్‌ను పలు వివాదాలు చుట్టుముడుతుండడంతో ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ రంగంలోకి దిగారు. భర్తకు అండగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. పీపుల్‌ మ్యాగజీన్‌ మాజీ స్టాఫ్‌ రిపోర్టర్‌ నటాషా స్టాయ్‌నాఫ్‌ చేసిన వ్యాఖ్యలపై మెలానియా మండిపడుతున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, అసత్యమన్నారు.

తన భర్తపై అసత్య ఆరోపణలు చేసినందుకు చట్టపరంగా చర్యలు ముందుకెళ్తానని చెప్పారు. 2005లో ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు ఆయన తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారని నటాషా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ సతీమణి మెలానియా ఖండించారు.

నటాషా దీనిపై క్షమాపణలు కోరాలని మెలానియా తన లాయర్‌ ద్వారా ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. క్షమాపణలు చెప్పలేదంటే చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు. ట్రంప్‌, నటాషా అసలు కలవలేదని, వారి మధ్య సంభాషణ జరగలేదని, స్నేహితులు కాదని, ఏమాత్రం స్నేహం లేదని మెలానియా లాయర్‌ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+