ట్రంప్ మాట: ఏప్రిల్ నాటికి ప్రతీ అమెరికన్‌ను వ్యాక్సిన్.. పూర్తిస్థాయిలో అందుబాటులో..
అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. 6.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో అమెరికా వణికిపోతోంది. వైరస్‌కు వ్యాక్సిన్ రావడం మరింత ఆలస్యం అవడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ గురించి మరోసారి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. తమ దేశంలోని ప్రతీ పౌరునికి మరో 7 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఈ వార్త అమెరికన్లకు కాస్త ఊరట కలిగిస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రతీ పౌరుడికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైరస్ విజృంభించడం వల్ల నెల నెల మిలియన్ల కొద్దీ డోసులు అవసరవుతాయని తెలిపారు. అయితే ఏప్రిల్ వరకు మాత్రం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఉంటుందని.. కొరత ఉండబోదు అని చెప్పారు. అన్నీ నిర్దారణ పరీక్షలు చేసి.. సేఫ్ అని ఫేడరల్ హెల్త్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపిన 24 గంటల్లో వ్యాక్సిన్ మార్కెట్‌లో వస్తుందని తెలిపారు.

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని.. త్వరలోనే తాము వైరస్‌ను జయిస్తామని తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అక్టోబర్ వరకు వస్తుందని ఇదివరకు ట్రంప్ పేర్కొన్నారు. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తోందనే అంశంపై నిపుణులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రయోగాలు చివరి దశలో ఉన్నందున.. సమయం చెప్పడం లేదు. కానీ ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. వైరస్‌ను తరిమికొడతామని ట్రంప్, నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications