ఎన్నికలయ్యాక ఆ మహిళల పని చెప్తా: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: తన పైన ఆరోపణలు చేస్తున్న మహిళలకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తన పైన లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిని న్యాయస్థానానికి లాగుతానని ఆయన చెప్పారు. వారిపై దావా వేస్తానన్నారు.
మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేసిన ట్రంప్ వీడియోలు కొన్ని ఇటీవల బయటకు రావడంతో సొంత పార్టీ నుంచే ఆయనకు వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే. శనివారం పెన్సిల్వేనియాలోని గెట్టీస్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో.. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిస్తే మొదటి వంద రోజుల్లో ఏం చేస్తారు అన్ని అంశాన్ని ప్రస్తావించవలసి ఉంది. కానీ దాని పైన మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.

తాను లైంగికంగా వేధించానంటూ ఆరోపణలు చేసిన మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళంతా అబద్ధాలు చెప్పారని, అవన్నీ కల్పితాలే అన్నారు. అలా నేను ఎన్నడూ చేయలేదన్నారు.
ఎన్నికలు ముగిశాక వారి పని చెప్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు కూడా ఓ చిన్న ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందినా నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తోందన్నారు. హిల్లరీ దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు.
తన ప్రచారాన్ని దెబ్బతీసేందుకు పలువురు మహిళలు బయటకు వస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా, గత రెండు వారాల్లో దాదాపు పది మంది మహిళలు బయటకు వచ్చి ట్రంప్ పైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications