నేనైతే ఆయుధం లేకున్నా ఫ్లోరిడా స్కూల్‌కు వెళ్ళేవాడిని: ట్రంప్
వాషింగ్టన్:తన వద్ద ఆయుధం లేకపోయినా ఫ్లోరిడా స్కూల్‌లో విద్యార్ధులను కాపాడేందుకు తాను వెళ్ళేవాడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాలో గవర్నర్ల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలోని ప్లోరిడా స్కూల్‌లో కాల్పుల ఘటనల్లో సుమారు 17 మంది మరణించారు.
ఫ్లోరిడా ఘటనపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు నన్ను పరీక్షించే వరకు నమ్మలేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయుధం లేకున్నా తాను విద్యార్థులను కాపాడేందుకు వెళ్ళేవాడినని ట్రంప్ గవర్నర్ల సదస్సులో వ్యాఖ్యానించారు.

పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ అధికారులను ఆదేశించారు. ఇలాంటివి జరగకుండా దీర్ఘాకాలిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. స్కూల్ సిబ్బందిలో శిక్షణ పొందిన, తగిన ధ్రువీకరణ పత్రం కలిగిన వారి వద్ద ఆయుధాలు ఉంచాలని సూచించారు.
స్కూల్లో ఆయుధాలతో సెక్యురిటీ గార్డులను నియమించడం కుదురతుందని అనుకోవట్లేదని పేర్కొన్నారు. ఫ్లోరిడా స్కూల్‌లో దాడి జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న డిప్యూటీ షెరీఫ్‌ల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని అన్నారు. గత వారం కొందరు డిప్యూటీ షెరీఫ్‌ల పనితీరు గమనించానని చెప్పారు. న్యాయ విభాగం ముందు తనతో సహా ఎవ్వరూ ఎక్కువ కాదని వెల్లడించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications