అక్రమ వలసదార్ల అరెస్ట్..! కఠిన నిర్ణయం తీసుకున్న అమెరికా..!!
వాషింగ్టన్/హైదరాబాద్ : రోజూ ఏదో ఒక వార్తతో సంచలనం సృష్టించే అమెరికా ఇప్పుడు వలదారుల నిర్బంధంపై దృష్టి కేంద్రీకరించింది. దేశంలో వలసదార్లను పెద్ద సంఖ్యలో ఏరివేసేందుకు, వారిని దేశ బహిష్కరణ చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధమైంది. అక్రమ వలసదార్లను ఆదివారం నుంచి అరెస్టు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. లక్షలాది అక్రమ వలసదార్లను అరెస్టు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
తగిన ఉత్తర్వులతో వారిని దేశ బహిష్కారం చేయనున్నట్టు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ డైరెక్టర్ మాథ్యూ అల్‌బెన్స్ తెలిపారు. అరెస్టులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాబోవని, కేసుల దర్యాప్తును అనుసరించి అధికారులు ఎక్కడికంటే అక్కడికి పోతారని ఆయన చెప్పారు. అరెస్టు చేసిన వారిని వారి వారి దేశాలకు పంపుతామని, నేరాలకు పాల్పడిన వారిని ఇక్కడ లేదా వారి దేశాల్లోని జైళ్లకు పంపుతామని ట్రంప్ ప్రకటించారు.

అధికారులు అందిస్తున్న వివరాల ప్రకారం, 2000 మందిని లక్ష్యంగా చేసుకుని సోదాలు నిర్వహించనున్నారు. గతంలో జరిగిన దాడులను బట్టి ఇప్పుడు కనీసం 200 మందిని అరెస్టు చేయవచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ సర్కారు నిర్ణయాలు అగ్రరాజ్యంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ చర్యలు అమానవీయమైనవంటూ డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
మధ్య అమెరికా నుంచి ఇంతకు ముందెన్నడూ లేనంత మంది ప్రజలు ఇటీవల యూఎస్ సరిహద్దులకు చేరుకున్న విషయం తెలిసిందే. వీరిలో పలువురు ఇమ్మిగ్రేషన్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. 2016లో బరాక్ ఒబామా హయాంలోను, 2017లో ట్రంప్ హయాంలోను అక్రమ వలసదార్లపై ఇదే తరహా ఆపరేషన్ నిర్వహించారు.
-
ఇరాన్ పై తప్పిన లెక్కలు-ట్రంప్ వన్నీ అబద్ధాలే-జో కెంట్ షాకింగ్..! -
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..! -
ఇజ్రాయెల్ చేసింది తప్పే..! తొలిసారి అంగీకరించిన ట్రంప్..! -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
అమెరికాకు గుడ్ బై చెప్తే.. భారీగా డబ్బు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ -
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications