అప్పుడే ఏమైంది?: అసలు పరీక్ష ముందుంది: ట్రంప్ వీడియో మెసేజ్: మెలానియాపై: అబద్ధాల రాజ్యం
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. ఆసుపత్రి నుంచి వీడియో మెసేజీని విడుదల చేశారు. తాను ఆరోగ్యం నిలకడగా ఉందని, డాక్టర్లు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. త్వరలోనే కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటానని, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాననీ వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారని చెప్పారు.
కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవలే క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహించిన తొలి డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జో బిడెన్‌ను ఆయన ఎదుర్కొన్నారు. ఈ డిబేట్ ముగిసిన మరుసటి రోజే ట్రంప్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరారు.

తాజాగా- ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ద్వారా ట్రంప్ తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు. తన ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే కోలుకుంటాననీ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటాననీ అన్నారు. డాక్టర్లు తనకు చికిత్స చేస్తోన్న తీరు అద్భుతంగా ఉందని, వారు ప్రత్యక్ష దైవాలని ప్రశంసించారు. అద్భుతాలను సృష్టించడం డాక్టర్ల చేతిలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
— Donald J. Trump (@realDonaldTrump) October 3, 2020
తనకు అసలు పరీక్ష ముందు ఉందని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో అబద్ధాలు రాజ్యమేలుతున్నాయని, వాటి గోడలను తాను బద్దలు కొట్టాల్సి ఉందని అన్నారు. క్లీవ్‌ల్యాండ్‌లో నిర్వహించిన తొలి డిబేట్‌పై ప్రజల్లో ఫీల్ గుడ్ అభిప్రాయం ఏర్పడిందని చెప్పారు. కీలక సమయంలో తాను ఆసుపత్రిలో చేరడం బాధ కలిగిస్తోందని అన్నారు. అమెరికాను మరోసారి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
Recommended Video
అబద్ధాలు ఎంతో కాలం మనుగడ సాగించలేవనీ చెప్పారు. అగ్రరాజ్యం అనే పేరును నిలబెట్టడానికి ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొంటాననీ చెప్పారు. రెండురోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటానని, మునుపటిలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. మెలానియా ట్రంప్ మరింత వేగంగా కోలుకుంటోందని ఆయన తెలిపారు. తన కంటే యంగ్ కావడం వల్ల కరోనా బారి నుంచి ఆమె అంచనాలకు మించిన వేగంతో కోలుకుంటున్నారని చెప్పారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications